Allu Arjun Thanks To Pawan Kalyan: మెగా- అల్లు మధ్య గొడవలు లేనట్లే.. కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్ అని చెప్పిన బన్నీ!
'పుష్ప - 2' టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.
- Author : Gopichand
Date : 07-12-2024 - 8:38 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Arjun Thanks To Pawan Kalyan: ‘పుష్ప – 2′ టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Allu Arjun Thanks To Pawan Kalyan) హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. ‘స్పెషల్ నోట్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్’ అనగానే సక్సెస్ మీట్ ప్రోగ్రాంకు వచ్చిన వారు కేరింతలు కొట్టారు. కాగా, అల్లు-మెగా ఫ్యాన్స్ గొడవల వేళ బన్నీ ఈ కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"On a personal note, కళ్యాణ్ బాబాయ్ Thank You So Much."#AlluArjun thanks the governments of Telugu states for approving ticket price hikes. pic.twitter.com/xPhgONV10y
— Gulte (@GulteOfficial) December 7, 2024
మరోసారి సారీ చెప్పిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంపై అల్లు అర్జున్ మరోసారి స్పందించారు. ‘గత 20 ఏళ్లుగా నేను ఆ థియేటర్‌కు వెళ్తున్నాను. మొన్న సినిమా చూస్తుండగా మా మేనేజర్ వచ్చి బయట గందరగోళంగా ఉంది. వెళ్లిపోమని చెప్పారు. ఆ తర్వాతి రోజు ఈ ఘటన గురించి తెలిసింది. ఆ షాక్ లో వెంటనే స్పందించలేకపోయాను. ఆమె కుటుంబానికి సారీ చెబుతున్నా. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’ అని చెప్పారు.
Also Read: BRS : రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు – కేటీఆర్
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అల్లు అర్జున్ థాంక్స్
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘పుష్ప 2’ సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘మాకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు. ముఖ్యంగా కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు’’ అని తెలిపాడు.
ఇకపోతే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ రెండు రోజుల్లో రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మైల్ స్టోన్‌ను అందుకున్న ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీగా నిలిచిందని మేకర్స్ తెలిపారు. ఇకపోతే సుకుమార్- ఐకాన్ స్టార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.