Allu Arjun : ‘స్టార్ పెర్ఫార్మర్’ పేరు తెచ్చుకోవాలనుంది.. అదే నా లక్ష్యం!
అల్లు అర్జున్.. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆర్య, పరుగు, దేశముదురు, అలా వైకుంఠపురం లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు.
- By Balu J Published Date - 12:31 PM, Wed - 29 December 21

అల్లు అర్జున్.. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆర్య, పరుగు, దేశముదురు, అలా వైకుంఠపురం లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు. స్టైలిస్ట్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ఎదిగారు. తాజాగా విడుదలైన ‘పుష్ప’ మూవీ నాలో కొత్త కోణాన్ని అవిష్కరించిందంటున్నాడు ఈ హీరో.
టాలీవుడ్ డైరెక్టర్ సుక్కు, ఐకాన్ స్టార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా అంచనాలకు మించి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడారు. ‘‘స్టార్‌గా కాకుండా “స్టార్ పెర్ఫార్మర్”గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాని అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ మెయిన్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన తన చిత్రం ‘పుష్ప’ తనకు భిన్నంగా ప్రయత్నించే అవకాశాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
‘‘నటననే ప్రపంచంగా బతికే నటులకు కంఫోర్ట్ జోన్ కు కట్టుబడి ఉండరు. పుష్ప నిజంగా నన్ను విభిన్నంగా నటించడానికి పురికొల్పింది. నేను స్టార్ పెర్‌ఫార్మర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను అదే నా లక్ష్యం. కమర్షియల్ సినిమాల్లో పెర్‌ఫార్మెన్స్ కు స్కోప్ ఉండదని, ప్రేక్షకులు తప్పుగా అంచనా వేస్తున్నారు. కానీ పాన్ ఇండియా లేదా సమాంతర సినిమా కంటే కమర్షియల్ సినిమాలో పెర్ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్ ఉంది. సమాంతర సినిమాలో పెర్ఫార్మెన్స్ సీన్ బేస్డ్ అయితే కమర్షియల్ సినిమాల్లో డ్యాన్స్, యాక్షన్, సీన్ బేస్డ్ ఉంటాయి. పుష్పకు ముందు గతంలో రుద్రమదేవి చేశా. యాక్షన్ ఉంది కానీ పెర్ఫార్మెన్స్ లేదు. చాలా కాలం తర్వాత జనాలు ప్రజలు థియేటర్‌లకు వచ్చి సినిమాను ఆస్వాదిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. పుష్పకు ఇంత పెద్ద స్పందన వస్తుందని ఊహించలేదు’’ అని బన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
డిసెంబర్ 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం 11 రోజుల్లో 275 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ మాట్లాడే మార్కెట్‌లో పుష్ప: రైజ్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి హిందీలో రూ.39.95 కోట్లు రాబట్టింది. రెండు దశాబ్దాల కెరీర్‌లో, నటుడు బన్నీ, ఆర్య సిరీస్, దేశముదురు, పరుగు, అలా వైకుంఠపురంలో, రుద్రమదేవి వంటి యాక్షన్ చిత్రాలలో నటించాడు. పుష్ప మూవీ కోసం స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, రియలిస్టిక్ గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు.