Big Breaking : అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
Big Breaking : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్ట్. ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది
- By Sudheer Published Date - 04:20 PM, Fri - 13 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్ట్ (nampally COurt). ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై యావత్ సినీ లోకం భగ్గుమంటుంది. చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి..అనంతరం గాంధీ హాస్పటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసారు.అనంతరం నాంపల్లి కోర్ట్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం జడ్జ్ ముందు బన్నీ ని హాజరు పరిచారు. కోర్ట్ లో వాదనలు విన్న జడ్జ్ …అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తు తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు జైలు పరిసరాల్లో నిఘా పెంచి, ఎలాంటి హానికరమైన చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అల్లు అర్జున్‌ను రిమాండ్ ఖైదీల బ్యారక్‌లో ఉంచుతారు. సినీ నటుడు కావడంతో నేరస్తులకు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు దూరంగా అల్లు అర్జున్‌ను పెడతారు. రిమాండ్ ఖైదీల్లో ఎక్కువ నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు దూరంగా ఉంచుతారు. విఐపీ కావడంతో ఆయనకు జైలులో ప్రత్యేక గదిని కేటాయించే అవకాశం ఉంది.