Pushpa : అల్లు అర్జున్ ఇలా భంగపడటం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్పపై భారీ అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాటిని అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ బావున్నా.. సెకండ్ హాఫ్ మరీ లాగ్ ఉంది. కంటెంట్ కూడా వీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వాల్సిన కంటెంట్ మరింత బలహీనంగా ఉండటంతో పాటు లెంగ్త్ కూడా ఎక్కువైంది.
- By Hashtag U Published Date - 05:12 PM, Sat - 18 December 21

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్పపై భారీ అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. కానీ వాటిని అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ బావున్నా.. సెకండ్ హాఫ్ మరీ లాగ్ ఉంది. కంటెంట్ కూడా వీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వాల్సిన కంటెంట్ మరింత బలహీనంగా ఉండటంతో పాటు లెంగ్త్ కూడా ఎక్కువైంది. ఓవరాల్ గా పుష్పకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందు కెజీఎఫ్ కంటే ఎక్కువగా బిల్డప్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు భంగపడింది. అయితే ఇలా భంగపడటం బన్నీకి కొత్త కాదు. అసలామాటకొస్తే.. ఈ తరహా సినిమాలు అతను కావాలనే చేస్తుంటాడు.
గతంలో రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర చూసి తను బద్రీనాథ్ అనే సినిమా చేశాడు. సినిమా కోసం అతను చాలా కష్టపడ్డాడు గానీ కథలేని సినిమాకు కండబలం చూపితే ఏం ఉపయోగం ఉంటుంది. అందుకే బద్రీనాథ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత ఎన్టీఆర్, వినాయక్ కాంబోలో వచ్చిన అదుర్స్ చూసి తను కూడా అలాంటి బ్రాహ్మిణికల్ కామెడీ చేయాలని దువ్వాడ జగన్నాథమ్ అన్నాడు. అది కూడా పోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో అతను ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేశాడు అనే విమర్శలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పుష్ప కు సైతం మరో ఇన్సిస్పిరేషన్ ఉంది. అదే రంగస్థలం.రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలం వంటి రా కథ తనూ చేయాలనుకున్నాడు. చేశాడు. బట్ రిజల్ట్ మారలేదు. ఎప్పట్లానే ఇదీ పోయింది. దీంతో మరోసారి తను భంగపడినట్టైంది. ఏదైనా ఎవరో చేశారు హిట్ కొట్టారు అని ఆ రూట్ లో వెళ్లడం కాకుండా తను తనలాగే అల వైకుంఠపురములో వంటి చిత్రాలతోనే విజయాలు సాధిస్తేనే బెటరేమో బన్నీ…