Pushpa 2 : పుష్ప 2 ప్రమోషన్స్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
Pushpa 2 షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉండగా దానితో పాటుగా రిలీజ్ నెల రోజులే ఉన్న కారణంగా సినిమాకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఆలోవర్ ఇండియా
- By Ramesh Published Date - 09:50 PM, Mon - 4 November 24

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి చేయాల్సి ఉండగా దానితో పాటుగా రిలీజ్ నెల రోజులే ఉన్న కారణంగా సినిమాకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఆలోవర్ ఇండియా తిరిగి పుష్ప 2 ని ప్రమోట్ చేస్తారని తెలుస్తుంది.
పుష్ప 2 (Pushpa 2) పై ఉన్న బజ్ ఇంకస్త ప్రమోషన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ భారీ స్కెచ్ వేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా ఫాహద్ ఫాజిల్, సునీల్ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఇది సార్ నా బ్రాండ్ అంటూ పుష్ప 1 చివర్లో ట్విస్ట్ ఇచ్చిన పుష్ప రాజ్ పార్ట్ 2 లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్ సినిమా రేంజ్ పెంచుతూ వెళ్లింది. మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ కూడా సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడని తెలుస్తుంది. తప్పకుండా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం పుష్ప 2 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పొచ్చు.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ ఛాన్స్ ఎవరికి ఉంది..!