HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Gave Me Rs 5 Lakhs Check Posani Krishna Murali

Posani Krishna Murali: బన్నీ ఇంటికి పిలిచి రూ.5 లక్షలు ఇచ్చాడు: పోసాని

ఇటీవల కాలంలో నటుడు పోసాని కృష్ణమురళి ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు. రాజకీయ పరంగా, సినిమా పరంగా వివాదాస్పదంగా మారుతున్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 31-08-2023 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Posani Krishna Murali
New Web Story Copy 2023 08 31t162433.911

Posani Krishna Murali: ఇటీవల కాలంలో నటుడు పోసాని కృష్ణమురళి ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు. రాజకీయ పరంగా, సినిమా పరంగా వివాదాస్పదంగా మారుతున్నారు. తాజాగా ఆయన అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తనను ఇంటికి పిలిచి రూ.5 లక్షల చెక్కు ఇచ్చారని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. నిజానికి ఈ విషయాన్ని 2018లోనే చెప్పిన పోసాని.. ఇప్పుడు మరోసారి గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి.. అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రెస్‌మీట్‌లో పోసాని నంది నాటకోత్సవం గురించి వివరిస్తుండగా అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంపై మీ స్పందన ఏంటి సార్ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై పోసాని కృష్ణమురళి స్పందిస్తూ బన్నీతో తనకున్న అనుబంధాన్ని, అతని గొప్పతనాన్ని వివరించారు.

అల్లు అర్జున్ నాకు ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్. నేను సీనియర్‌ని అయినా నేనంటే ఆయనకు ఇష్టం. ఒకసారి నాకు ఫోన్ చేసి మురళి ఒకసారి మా ఇంటికి రావాలని.. టీ కి ఆహ్వానించాడు అని చెప్పాడు. బన్నీ కోరిక మేరకు నేను వెళ్ళాను.. టీ ఇచ్చి లోపల నుంచి కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చూస్తే రూ.5 లక్షల చెక్కు ఉంది. ఏం బాబూ చెక్కు ఇచ్చావు అని అడిగాను. నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. నేను బాగానే ఉన్నాను.. బాగా సెటిల్ అయ్యాను.. ఎందుకు ఇస్తున్నావ్? అని అడిగాను. అప్పు అల్లు అర్జున్.. ఇష్టంతో ఇచ్చాను దయచేసి కాదనకండి ప్లీజ్ అంటూ నాకు ఇచ్చాడు అని పోసాని కృష్ణ మురళి గుర్తు చేసుకున్నాడు. .

ఆ చెక్కును తీసుకుని మంచి పనికి వాడుకున్నానని పోసాని వివరించారు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించి, చదువుకునే స్థోమత లేక ఏదో ఒక పని చేస్తున్న పిల్లల గురించి ఖర్చు చేసానని పోసాని తెలిపారు. అయితే ఈ సాయం నేను చేయలేదు.. అల్లు అర్జున్ చేసాడు.. థాంక్స్ చెప్పాలని లైవ్ లో చెప్పాను అని పోసాని గుర్తు చేసుకున్నారు.

Also Read: Urvashi Rautela: ఒక నిమిషానికే కోటి రెమ్యూనరేషన్, పవన్ కు షాక్ ఇచ్చిన ఐటెం బ్యూటీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2018
  • 5 lakhs
  • allu arjun
  • Nandi Natakotsavam
  • National Best Actor
  • Posani Krishna Murali

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd