Allu Arjun : తండేల్ మీద అల్లు అర్జున్ ఎఫెక్ట్..!
Allu Arjun ఆ సినిమా నుంచి రెండో సాంగ్ శివరాత్రి సాంగ్ వదలబోతున్నారు. అసలైతే 21 సాయంత్రం కాశీలో ఈ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ శనివారం అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడటం వల్ల ఇష్యూ
- By Ramesh Published Date - 08:45 AM, Sun - 22 December 24

పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ షో టైం లో జరిగిన సంఘటన వల్ల అల్లు అర్జున్ (Allu Arjun) రిస్క్ లో పడ్డాడు. పోలీసుల పర్మిషన్ లేకుండానే అక్కడికి వెళ్లి ర్యాలీ చేశాడన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే అతన్ని అరెస్ట్ చేయాలని అనుకోగా పూట మాత్రమే జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇష్యూపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
ఐతే ఈ గొడవల వల్ల గీతా ఆర్ట్స్ (Geetha Arts) నుంచి రాబోతున్న తండేల్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. తండేల్ సినిమా నుంచి మొదటి సాంగ్ గా బుజ్జి తల్లి సాంగ్ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా నుంచి రెండో సాంగ్ శివరాత్రి సాంగ్ వదలబోతున్నారు. అసలైతే 21 సాయంత్రం కాశీలో ఈ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ శనివారం అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడటం వల్ల ఇష్యూ పెద్దదైంది.
అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన మీద పర్సనల్ ఎలిగేషన్స్ వేస్తున్నారని అన్నాడు. ఐతే ఈ గొడవల వల్ల నాగ చైతన్య (Naga Chaitanya) తండేల్ సినిమా సాంగ్ ని రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. మళ్లీ నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చెప్పలేదు. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ లో జరిగిన ఈ ఇష్యూ ఇప్పుడప్పుడే క్లోజ్ అయ్యేలా లేదు.
చూస్తుంటే మళ్లీ అల్లు అర్జున్ ని జైలుకి పంపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనిపిస్తుంది. మరి ఇష్యూ తేలే వరకు తండేల్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ కి ఇది షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పొచ్చు.
Also Read : Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ కోసం పవర్ స్టార్..?