Allu Arjun : అల్లు అయాన్ మోడల్ బోల్తే.. తనయుడికి మైలేజ్ పెంచే ప్రయత్నంలో అల్లు అర్జున్..!
Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఒక మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న అల్లు అర్జున్
- Author : Ramesh
Date : 22-02-2024 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఒక మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అక్కడ అందరి గురించి వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలని అభిమానులు అడిగితే ఓకే అని అన్నారు. ఈ క్రమంలో తన కొడుకు అల్లు అయాన్ పేరు చెప్పగానే మోడల్ బోల్తే అంటూ చెప్పాడు. సోషల్ మీడియాలో అల్లు అయాన్ సందడి తెలిసిందే. అతను చేస్తున్న వీడియోలు అలరిస్తాయి.
ఆ ఉద్దేశంతోనే అల్లు అయాన్ ని మోడల్ బోల్తే అంటూ చెప్పాడు అల్లు అర్జున్. వారసుడి మైలేజ్ పెంచే ప్రయత్నంలో అల్లు అర్జున్ భారీ ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు. అల్లు అయాన్ తో పాటుగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వారిద్దరు చేసే అల్లరిని అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వారి సోషల్ మీడియా వేదికలో పంచుకుంటారు.
అల్లు అయాన్ గురించి మాత్రం అల్లు అర్జున్ మోడల్ బోల్తే అని కామెంట్ చేయడం అల్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అల్లు అయాన్ కూడా ఫ్యూచర్ స్టార్ అవుతాడని చెప్పకనే చెప్పాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఆ సినిమాతో మరోసారి రికార్డుల మీద కన్నేశాడు అల్లు అర్జున్.
#AlluAyaan Model Bolthey 🔥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/XDqnIo9p8P
— Rishabh Pant Fan 🐉 (@ShivagoudAA) February 21, 2024