Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. బర్త్‌డేకి అవేవి లేవంట..
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. ఈ బర్త్‌డేకి అవేవి లేవంట. కేవలం పుష్ప టీజర్ మాత్రమే.
- By News Desk Published Date - 11:38 AM, Wed - 3 April 24
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8న జరగబోతున్న సంగతి తెలిసిందే. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు, మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం.. వంటి గొప్ప గౌరవాలు అందుకున్న తరువాత అల్లు అర్జున్ చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ అంతా ఈ పుట్టినరోజుని భారీగా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ నుంచి ఇలాంటి గ్రాండ్ అప్డేట్స్ రాబోతున్నాయని టాక్ వినిపించింది.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌ని.. ఈ బర్త్ డేకి అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తూ వచ్చింది. అయితే వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ బర్త్ డేకి అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ని సిద్ధం చేయడం లేదట. ఆ సినిమా మాత్రమే కాదు, మరే కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వడం లేదట. కేవలం పుష్ప 2 టీజర్ ని మాత్రమే రిలీజ్ చేయనున్నారట.
ఇది ఇలా ఉంటే, ఈ బర్త్ డేని థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి ఆర్య 2 సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఈ మూవీని కూడా రిలీజ్ చేయడం లేదట. అలాగే కొన్ని చోట్ల జులాయి సినిమాని స్పెషల్ షోలు వేయడానికి ప్లాన్ చేసారు. అవి కూడా క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. ఇలా బర్త్ డేకి స్పెషల్ షోలు లేక, స్పెషల్ అప్డేట్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి వస్తుంది.
మరి ఈ నిరాశని పుష్ప టీజర్ సంతృప్తి పరుస్తుందేమో చూడాలి. లాస్ట్ ఇయర్ బర్త్ డేకి రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో అయితే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కాగా ఈ టీజర్ ని ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు గాని, కరెక్ట్ టైం చెప్పలేదు.
Also read : Pawan Kalyan : 2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలని అనుకున్న.. కానీ.. పవన్ కామెంట్స్
Related News
Vaishnavi Chaitanya : స్పిరిట్ లో బేబీ.. అంతకుమించిన అదృష్టమా..?
Vaishnavi Chaitanya యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత వెబ్ సీరీస్ లతో మెప్పించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసిన తొలి సినిమా బేబీతో