Pawan Kalyan : 2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలని అనుకున్న.. కానీ.. పవన్ కామెంట్స్
2007లో పవన్ కళ్యాణ్ జీసస్ క్రీస్తుపై ఓ సినిమా తీయాలని అనుకున్నారట. కానీ..
- By News Desk Published Date - 10:37 AM, Wed - 3 April 24

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తన పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే దారి మధ్యలో ఉన్న గుడి, చర్చి, మసీద్ లకు కూడా వెళ్తూ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా పవన్ ఓ చర్చికి వెళ్లి అక్కడ ప్రార్థనలో పాల్గొనడమే కాదు, బైబిల్ లోని కొన్ని వ్యాఖ్యలు చదివి అక్కడ ఉన్న భక్తులకు వినిపించారు.
ఇక ఆ సమయంలో పవన్ ఓ ఆసక్తికర విషయాన్ని అందరికి తెలియజేసారు. 2007లో తాను జీసస్ క్రీస్తుపై ఓ సినిమా చేయాలనీ భావించారట. అయితే అది పలు కారణాలు వల్ల ఆగిపోయిందని పవన్ చెప్పుకొచ్చారు. అప్పటిలో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాని సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించబోతున్నారని, తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావించారు. కానీ మూవీ పలు కారణాలు వల్ల కార్యరూపం దాల్చలేదు.
ABC (ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్) లో క్రైస్తవ పెద్దలతో ప్రార్థనల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను సమానంగా చూసే తత్వం కలిగినది. 2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలని ఉండింది, కానీ ఆ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది.
బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు… pic.twitter.com/xcrkmu7SPg
— Gulte (@GulteOfficial) April 2, 2024
కాగా తొలిప్రేమ సినిమాలోని ‘ఏమైందో ఏమో ఈ వేళ’ సాంగ్ లో పవన్ జీసస్ క్రీస్తులా కొన్ని సెకన్లు కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. పవన్ కెరీర్ లో ఇలా ఈ సినిమా మాత్రమే కాదు.. అనౌన్స్ చేసిన తరువాత ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘సత్యాగ్రహి’. జానీ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఏ ఎం రత్నం నిర్మాతగా ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసారు.
కానీ జానీ రిజల్ట్ తరువాత పవన్ కి ఈ సినిమా పై నమ్మకం కుదరలేదు. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ఆ సినిమాని పక్కనపెట్టాశారు. అయితే ఆ సినిమాలో ఏం చూపించాలని అనుకున్నారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టు అదే చేస్తున్నట్లు పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
Also read : Mrunal Thakur : రౌడీ బాయ్ విజయ్ తో పనిచేయడం ప్రతి హీరోయిన్ కల – మృణాల్