Allu Arha : ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్జున్ కూతురు? రెమ్యునరేషన్ కూడా భారీగానే?
ప్రస్తుతం దేవర సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది.
- Author : News Desk
Date : 16-07-2023 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దేవర(Devara) సినిమా మొదలుపెట్టాడు. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మాణంలో ఎన్టీఆర్(NTR) దేవర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో బాలీవుడ్(Bollywood) భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రస్తుతం దేవర సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఫుల్ మాస్ గా, చాలా పవర్ ఫుల్ గా ఈ సినిమా ఉండబోతుందని కొరటాల శివ చెప్పాడు. ఇక దేవర సినిమాని 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది.
దేవర సినిమాలో ఓ పాప క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ కూతురు అర్హని(Allu Arha) తీసుకున్నట్టు సమాచారం. ఒక పది నిముషాలు ఈ క్యారెక్టర్ ఉంటుందట. ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ బావ అని సరదాగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ కూడా అర్హ దేవర సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఇప్పటికే అర్హ సమంత శాకుంతలం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటించి బన్నీ అభిమానులని అలరించడమే కాక ప్రేక్షకులను కూడా మెప్పించింది.
ఇక దేవర సినిమాలో అర్హకి రెమ్యునరేషన్ కూడా దాదాపు 10 లక్షల పైనే ఇస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో అర్హ నిజంగానే ఉంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుంది. బన్నీ అభిమానులు కూడా దేవర సినిమా కోసం ఎదురుచూస్తారు. దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఏమన్నా చేస్తుందేమో చూడాలి.