Allu – Mega Families : అల్లు – మెగా ఫ్యామిలీ విభేదాలపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్ – చిరంజీవి?
అల్లు అరవింద్, చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరి మధ్య విబేధాలు లేవు అని అంతా భావిస్తున్నారు.
- By News Desk Published Date - 07:22 AM, Tue - 11 February 25

Allu – Mega Families : గత కొన్ని రోజులుగా అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య విబేధాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ జనసేనను కాదని వైసీపీ నేతను ఎన్నికల్లో సపోర్ట్ చేయడంతో ఈ విబేధాలు మరింత ఎక్కువ అయ్యాయని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు. అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు కూడా అందరూ బన్నీ ఇంటికి వెళ్లినా మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ వెళ్ళలేదు. ఇటీవల అల్లు అరవింద్ ఇండైరెక్ట్ గా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అని చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడింది. అయితే తాజాగా బ్యాక్ టు బ్యాక్ రెండు ఈవెంట్స్ లో అల్లు అరవింద్, చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరి మధ్య విబేధాలు లేవు అని అంతా భావిస్తున్నారు.
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. మా ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఉంటాము. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దానికి నేనెంతో గర్విస్తున్నాను అని అన్నారు. ఇక నిన్న తండేల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని తగ్గించాను అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అయి నన్ను ట్రోల్ చేసారు. ఫీల్ అయిన అభిమానులకు నేను చెప్తున్నాను. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను దిల్ రాజు గురించి చెప్పడానికి అలా మాట్లాడాను. చరణ్ నాకు కొడుకు లాంటివాడు. చరణ్ నాకు ఏకైక మేనల్లుడు. నేను చరణ్ కి ఏకైక మేనమామని. మా ఇద్దరి రిలేషన్ షిప్ చాలా బాగుంటుంది. దయచేసి ఇది ఇక్కడితో వదిలేయండి అని ఎమోషనల్ గా చెప్పారు.
దీంతో ఒకరి గురించి ఒకరు మాట్లాడటంతో మెగా – అల్లు ఫ్యామిలీల బంధం ఇప్పటిది కాదు అని, ఒకవేళ వారి మధ్య ఏవైనా విబేధాలు వచ్చినా సర్దుకుపోతారని పలువురు అంటున్నారు. కానీ కొంతమంది ఇప్పటి జనరేషన్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్ ని కూడా ట్రోల్ చేస్తూ ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు. గతంలో చాలా మంది హీరోలు మేము మేము బాగుంటం, ఫ్యాన్స్ వార్స్ చేయకండి అని చెప్పినా కొంతమంది అభిమానులు వినే స్టేజి లో లేరు.
అల్లు అరవింద్, చిరంజీవి కామెంట్స్ ని నిర్మాత SKN షేర్ చేస్తూ.. వాళ్ళందరూ బాగానే ఉంటారు. దయచేసి అనవసరం లేని ఫ్యాన్ వార్స్ చేయొద్దు. ముఖ్యంగా సిల్లీ ట్వీట్స్, పోస్టులు చేయొద్దు.నెగిటివిటీకి దూరంగా ఉండండి. ఎలాంటి సందర్భంలో అయినా అందరం ఒక్కటిగా ఉందాం, పాజిటివిటిని పెంచుదాం అంటూ ట్వీట్ చేసారు.
They are all good, so don't create unnecessary conflicts or engage in unhealthy fan wars online. Especially silly irritating tweets/posts Stay away from negativity. Any day, any situation, Let's all stay together! & Spread positivity pic.twitter.com/FZCdo9tkUu
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 10, 2025