Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
- By Balu J Published Date - 07:11 PM, Fri - 19 April 24
![Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/04/viral-video.jpg)
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియోలో ఒక ఇంటి పనిమనిషి పెంపుడు జంతువుపై హింసాత్మకంగా దాడి చేయడం చూడవచ్చు.
“ఈ పనిమనిషి చేతిలో క్రూరంగా కొట్టబడిన కుక్క వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఈ ఘటనపై జంతు ప్రేమిలకు ఫిర్యాదు చేయండి. ఇలాంటి వీడియోను తానెప్పుడూ చూడలేదని, షాక్ కు గురయ్యానని నటి పేర్కొంది. అయితే ఆలియా శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సోఫీ పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నెటిజన్స్ కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అలియా పోస్ట్ వైరల్ గా మారింది.
Pls share this
Dog walker at #khar #bandra needs to be reported to the owner. pic.twitter.com/pqIfVAlKRF
— majnu bhai (@DigitalAgarwal) April 18, 2024
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/5688ca3b815c0f683581ea16620f6bb81720941818045234_original.jpg)
Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్
ఏజెంట్ ద్వారా వీరేంద్ర సౌదీ వెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వంట చేసే పని కోసం అతనిని రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లిన వీరేంద్రకు షాక్ తగిలింది. అతన్ని ఎడారిలో ఒంటెలకు కాపలాగా ఉంచారు. ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసి ఎడారిలో వదిలేశాడని వాపోతున్నారు వీరేంద్ర