Akshay and Nora: ఊ అంటావా పాటకు దుమ్మురేపిన అక్షయ్ కుమార్, నోరా.. డాన్స్ వీడియో వైరల్!
పుష్ప హిట్ సాంగ్ కు బాలీవుడ్ స్టార్స్ అక్షయ్, నోరా అదిరిపొయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.
- By Balu J Updated On - 03:39 PM, Fri - 10 March 23

టాలీవుడ్ (Tollywood) హిట్ మూవీ పుష్ప రిలీజై ఏడాది దాటినా.. ఆ క్రేజ్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సీని వేదికలపై పుష్ప మూవీకి సంబంధించి పాటలు, డైలాగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), నోరా (Nora) ఫతేహి పుష్ప హిట్ సాంగ్ కు డాన్స్ చేసి ఆశ్చర్యపర్చారు. అల్లు అర్జున్, సమంతా కలిసి నటించిన పాపులర్ సాంగ్ ఊ అంటావాకి కలిసి డ్యాన్స్ చేసి సీని లవర్స్ ను ఆకట్టుకున్నారు. అక్షయ్ (Akshay Kumar), నోరా US పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.
అక్షయ్ కుమార్ (Akshay Kumar), దిశా పటాని, మౌని రాయ్, సోనమ్ బజ్వా, నోరా, అపర్శక్తి ఖురానా, స్టెబిన్ బెన్ వంటి ఇతర తారలు ది ఎంటర్‌టైనర్స్ పేరుతో US కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అక్షయ్, నోరా అద్భుతమైన డాన్స్ తో దుమ్మురేపడంతో నెటిజన్స్ నుంచి ఊహిచని రెస్పాన్స్ వచ్చింది. సమంత, అల్లుతో సరిపోలేరు అని కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. అయినప్పటికీ, నోరా అభిమానులు ఆమెను “అద్భుత ప్రదర్శనకారిణి” అని కితాబు ఇచ్చారు. ప్రస్తుతం అక్షయ్, నోరా డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
Also Read: Sreeleela With Balakrishna: బాలకృష్ణ చేయి పట్టుకున్న శ్రీలీల.. NBK 108లోకి ఎంట్రీ

Related News

Kangana Ranaut: బాత్రూం కష్టాలు భరించలేక లగ్జరీ కార్వాన్ కొన్నా: కంగనా రనౌత్
కంగనా రనౌత్ తన సినిమా కష్టాలను షేర్ చేసుకుంది. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంది.