Akhil Akkineni: నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన అఖిల్.. కానీ చివర్లో రామ్ చరణ్ అలా?
తాజాగా అక్కినేని హీరో అఖిల్ అక్కినేని ఒక వేడుకలో భాగంగా నాటు నాటు పాటకు స్టెప్పులు వేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో వైరల్ గా మారింది.
- By Anshu Published Date - 02:05 PM, Sun - 23 February 25

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అఖిల్ ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఏజెంట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తన ఆశలన్నీ కూడా తదుపరి సినిమాపై పెట్టుకున్నాడు అఖిల్. తెలుగులో ఇప్పటివరకు హలో,మిస్టర్ మజ్ను, ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలలో నటించి మెప్పించారు. కానీ ఈ సినిమాలేవి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.
ఇకపోతే ఇటీవలే అఖిల్ జైనాబ్ అనే ఒక అమ్మాయి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.. మన హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పే సమయం తొందర్లోనే రానుంది. ఈ క్రమంలోనే అఖిల్ జైనాబ్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపించాయి. మార్చి 24న అఖిల్ వివాహం జరగబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరిపాయని, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశామయని టాక్. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో అఖిల్ ఒక ఫంక్షన్ లో సందడి చేశారు.
#NaatuNaatu Song Steps by #AkhilAkkineni pic.twitter.com/egNErJK8Uq
— Milagro Movies (@MilagroMovies) February 22, 2025
ఈ సందర్భంగా తన ఫ్రెండ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అఖిల్ వేరే వ్యక్తితో కలిసి స్టెప్పులేశాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే చివర్లో అఖిల్ కావాలనే కింద పడిపోయాడు. నాటు నాటు పాటలో రామ్ చరణ్ లాగే కావాలని పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ కూడా ఆ మాదిరిగానే లాస్ట్ కింద పడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు రామ్ చరణ్ లా అఖిల్ కావాలనే పడిపోయాడని కామెంట్లు చేస్తున్నారు.