HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Akhil Akkineni And Naga Chaitanya Upcoming Movie

Akhil Akkineni: రామ్ చరణ్, ప్రభాస్.. ఈ ఇద్దరిలో అక్కినేని అఖిల్ కి అండగా నిలిచేదెవరు?

తెలుగు ప్రేక్షకులకు అక్కినేని ఫ్యామిలీ గురించి, అక్కినేని హీరోల గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోల గురించి ఎక్కడ చూసి

  • Author : Anshu Date : 15-02-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 15 Feb 2024 08 09 Am 402
Mixcollage 15 Feb 2024 08 09 Am 402

తెలుగు ప్రేక్షకులకు అక్కినేని ఫ్యామిలీ గురించి, అక్కినేని హీరోల గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోల గురించి ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. అక్కినేని హీరోలు అయినా నాగార్జున నాగచైతన్య అఖిల్ ఎలాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఆ సినిమాలో ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సరైన హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మొన్నటికి మొన్న నాగార్జున నటించిన నా సామి రంగా సినిమా కూడా భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ఓటీటీ డేట్‌ వచ్చినప్పటి నుంచీ అక్కినేని వారసుల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. చైతన్య చేస్తున్నదేంటి? అఖిల్‌ ఆగిందెక్కడ? అంటూ డిస్కషన్‌ షురూ అయింది. నా సామి రంగ అంటూ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించారు అక్కినేని నాగార్జున. 2024కి నా వాటా పూర్తయింది అంటుండగా, ఇక అందుకోవాల్సింది నాగచైతన్య అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అప్పుడెప్పుడో లవ్‌స్టోరీని మ్యూజికల్‌ హిట్‌గా అందించారు చైతూ. ఆ తర్వాత ఆ సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ, బంపర్‌ హిట్‌ మాత్రం ఆయన్ని రీసెంట్‌ టైమ్స్ లో పలకరించలేదు. అందుకే తండేల్‌ మీద స్పెషల్‌గా దృష్టి పెట్టారు చైతన్య. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకుని మరీ యాక్ట్ చేస్తున్నారు.

1

1

సాయి పల్లవితో, ఈ మూవీలో జోడీ కడుతున్నారు. ఎటొచ్చీ అక్కినేని అఖిల్‌ గురించే ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎంతో కష్టపడి, ఫిజిక్‌ పెంచి చేసిన ఏజెంట్‌ ఆయనకు నిరాశే మిగిల్చింది. అన్నీ వేళల్లోనూ తనకు సపోర్ట్ గా ఉన్న ఫ్యాన్స్ ని ఆ సినిమా రిలీజ్‌ టైమ్‌లో గుర్తుచేసుకున్నారు అక్కినేని చిన్నోడు. ఏజెంట్ ని మరిపించి, ఫ్యాన్స్ ని మురిపించే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు అఖిల్‌. యువీ క్రియేషన్స్ లో ఒక సినిమా కమిట్‌ అయ్యారు. సలార్‌ సీక్వెల్‌లో అఖిల్‌ చేస్తున్నారన్నది కూడా కన్‌ఫర్మ్ న్యూస్‌. రామ్‌చరణ్‌, సలార్‌ సీక్వెల్‌ తో ప్రభాస్‌ వీరిద్దరిలో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అఖిల్‌ కెరీర్‌ని ఎవరు గాడిలో పెడతారో చూడాలి మరి. అంతేకాకుండా అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ అఖిల్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. మరి ఈసారైనా సరైన సక్సెస్ ను అందుకుంటాడో లేదో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhil Akkineni
  • naga chaitanya
  • nagarjuna
  • prabhas
  • ram charan

Related News

Akhil’s ‘Lenin’ Teaser Released

Lenin: అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల..

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. మురళీకిశోర్‌ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆకట్టుకుంటున్న డైలాగులు ఈ టీజర్‌లో అఖిల్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘మనోడు

    Latest News

    • Jawa : BSA బైక్ రైడర్లకు గుడ్ న్యూస్

    • CM Revanth Reddy : సీఎం రేవంత్ కాన్వాయ్‌లోని వాహ‌నాలు తగ్గింపు

    • RTC BUS Accident : చేవెళ్ల‌లో ఆర్టీసీ బ‌స్సు- కారు ఢీ.. తృటిలో త‌ప్పిన పెనుప్ర‌మాదం

    • Car Race : హైటెక్ సిటీ వీధుల్లో కార్‌ రేస‌ర్లు హ‌ల్చ‌ల్‌.. పోలీసుల‌పైకి..?

    • Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

    Trending News

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd