Agent Trailer : యాక్షన్ కా బాప్.. అఖిల్ ఏజెంట్ ట్రైలర్ చూశారా??
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా నేడు కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు.
- Author : News Desk
Date : 18-04-2023 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని అఖిల్(Akkineni Akhil) మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు అన్ని లవ్ రోల్స్ చేసిన అఖిల్ ఇప్పుడు ఏజెంట్(Agent) సినిమాతో ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో అఖిల్, సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో ఏజెంట్ సినిమా భారీగా తెరకెక్కింది.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. తాజాగా నేడు కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూశాకా.. అఖిల్ ఇండియన్ గవర్నమెంట్ కి ఒక సీక్రెట్ ఏజెంట్ లా వర్క్ చేస్తాడు. ఒక పని కోసం విదేశాలకు పంపిస్తారు. మరి ఆ పని పూర్తయిందా? విలన్ ని అఖిల్ ఎలా ఎదుర్కొంటాడు అనేది కథాంశం అన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మేకింగ్ మాత్రం అదిరిపోయింది. సురేందర్ రెడ్డి అద్భుతమైన డైరెక్షన్ చేశాడు. అఖిల్ కూడా ఈ సినిమాకి చాలా బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. దీంతో సినిమాలో యాక్షన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.
Also Read : Pawan Kalyan : ఏమున్నాడ్రా బాబు.. OG సెట్ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్..