Akhanda 2 Teaser : మెగా, సూపర్ స్టార్ల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన బాలయ్య
Akhanda 2 Teaser : నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'అఖండ-2' టీజర్ (Akhanda 2 Teaser)తెలుగు సినిమా అభిమానుల మదిని కొల్లగొడుతోంది
- By Sudheer Published Date - 09:58 PM, Tue - 10 June 25

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘అఖండ-2’ టీజర్ (Akhanda 2 Teaser)తెలుగు సినిమా అభిమానుల మదిని కొల్లగొడుతోంది. విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ఈ టీజర్ యూట్యూబ్‌లో 22.33 మిలియన్ల వ్యూస్, 5.31 లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు చిత్రసీమలో అత్యంత వేగంగా వ్యూస్, లైక్స్ సాధించిన టాప్-5 టీజర్లలో చోటు దక్కించుకుంది. రాధేశ్యామ్, గేమ్‌చేంజర్, సర్కార్ వారి పాట, పుష్పరాజ్ వీడియోల జాబితాలో ఈ టీజర్ తన స్థానాన్ని దక్కించుకుంది.
Kommineni : ఛీ.. కొమ్మినేనిని వెనకేసుకొచ్చిన జగన్
ఇక ఈ సినిమా షూటింగ్ తాలూకా విశేషాలను బాలకృష్ణ పంచుకున్నారు. జార్జియాలో -4 డిగ్రీల ఉష్ణోగ్రతలలో జరిగిన షెడ్యూల్‌ను పేర్కొంటూ, యూనిట్ మొత్తం చలితో వణికిపోతుండగా తాను మాత్రం చిరు పంచె, స్లీవ్‌లెస్ వేషధారణలో ఆచలిని తట్టుకుని నిల్చున్నానని తెలిపారు. ‘‘చలి ఏమాత్రం బాధ పెట్టలేదు. అంతా ఆ శివలీల’’ అంటూ తన ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని పంచుకున్నారు. ఇక టీజర్ లో బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ లుక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నటుడిగా ఆయన చూపిన డెడికేషన్‌పై నెటిజన్లు ఆశ్చర్యపోతూ ‘‘బాలయ్యకు చలి కూడా వణికిపోయింది’’ అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు. అఖండ-2 టీజర్‌కి వచ్చిన స్పందన చూస్తే సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయని స్పష్టమవుతోంది.