Kommineni : ఛీ.. కొమ్మినేనిని వెనకేసుకొచ్చిన జగన్
Kommineni : టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొమ్మినేని అరెస్ట్ పూర్తిగా రాజకీయ ప్రతీకారమేనన్నారు. కేవలం ఓ డిబేట్‌ను నిర్వహించాడన్న కారణంగా ఆయనపై కేసులు పెట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు
- By Sudheer Published Date - 08:23 PM, Tue - 10 June 25

అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao), కృష్ణం రాజు (Krishnam Raju)చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తూ వారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీనివాసరావు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ ఇష్యూ పై వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొమ్మినేని అరెస్ట్ పూర్తిగా రాజకీయ ప్రతీకారమేనన్నారు. కేవలం ఓ డిబేట్‌ను నిర్వహించాడన్న కారణంగా ఆయనపై కేసులు పెట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇది మీడియా హక్కులకు విరుద్ధమని, మీడియా స్వేచ్ఛను హరించడమేనని ఆయన అన్నారు.
YS Jagan : ‘సాక్షి’ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
చంద్రబాబు ప్రభుత్వం మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులపై దాడులు చేస్తోందని , “సాక్షి” మీడియా సంస్థ కార్యాలయాలపై దాడులు జరిపిన తీరు పూర్తిగా కుట్రపూరితంగా ఉందని ఆరోపించారు. ఇది టీడీపీ అధిష్టానం కోసం చేయబడిన రాజకీయ పథకం భాగమని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలుగా వర్ణించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, గతంలో ఆయన మహిళలను ఎలా అవమానించారో దేశం మొత్తానికి తెలుసని జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా చంద్రబాబు, నారా లోకేశ్, బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను జగన్ ట్విట్టర్‌లో పంచుతూ.. ‘‘రోజు మహిళల పట్ల ప్రేమగా మాట్లాడేవారు, అప్పట్లో వీలైనన్ని విధాల అవమానించారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025