Akash Puri : ఆకాష్ పూరి అందుకే పేరు మార్చుకున్నాడా..?
మెగా , నందమూరి , అక్కినేని , ఘట్టమనేని , మంచు ఫ్యామిలీ ఇలా అనేక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఎంతోమంది హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ..అందరికి అదృష్టం కలిసిరాలేదు
- By Sudheer Published Date - 04:24 PM, Thu - 25 July 24

చిత్రసీమ (Film Industry)లో రాణించాలంటే కేవలం నటన , ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు..అదృష్టం కూడా కలిసిరావాలి. అప్పుడే రాణించగలరు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే..వారసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుండో నడుస్తుంది. మెగా , నందమూరి , అక్కినేని , ఘట్టమనేని , మంచు ఫ్యామిలీ ఇలా అనేక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఎంతోమంది హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ..అందరికి అదృష్టం కలిసిరాలేదు. వీరిలో కొంతమందే ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. కొంతమందైతే పాన్ ఇండియా స్టార్లు గా ఆకట్టుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం కనీసం 25 కోట్ల క్లబ్ లో కూడా చేరలేకపోయారు. అలాగే పలువురు డైరెక్టర్ల వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి ఒకరు.
We’re now on WhatsApp. Click to Join.
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిన ఆకాష్ (Akash)…2015లో ఆంధ్ర పోరి (Andhra Pori) మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. తండ్రి స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆకాష్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో ఆకాష్ తాజాగా తన పేరును మార్చుకున్నాడు. నేడు ఆకాష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పేరు మార్చుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
`నా పేరులో మార్పు జరిగింది ఇకపై నా పేరు ఆకాష్ పూరీ కాదు.. ఇప్పటినుంచి నేను ఆకాష్ జగన్నాథ్` అని ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. అయితే ఆకాష్ పేరు మార్చుకున్న విషయాన్ని తెలిపాడుగానీ.. అందుకు గల కారణం ఏంటి అన్నది మాత్రం వెల్లడించలేదు. కెరీర్ పరంగా కలిసిరావడానికే ఆకాష్ తన పేరును మార్చుకున్నాడని అభిమానులు మరియు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఆకాష్ మాత్రమే కాదు ఇటీవల చాలామంది హీరోలు తమ పేర్లను మార్చుకొని సక్సెస్ బాట పట్టారు. అందుకే ఇప్పుడు ఆకాష్ కూడా తన పేర్లు మార్చుకున్నట్లుంది. చూద్దాం మరి పేరు మార్పు అతడికి ఎంత కలిసొస్తుందో..!!
Read Also : AP Assembly : టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి దీక్ష చేయడం ఏంటి జగన్..? – హోంమంత్రి అనిత