AI Pushpa 2 Trailer : అరై పుష్ప 2 ట్రైలర్ ను ఇలా చేశారేంట్రా..? రేయ్ .. ఎవర్రా మీరంతా..!!
AI Technology Pushpa 2 : ఈ వీడియో చూసి కొంతమంది నవ్వుకుంటూ ఏమైనా చేసారా..వారి ఐడియా సూపర్బ్ అని ప్రశంసిస్తుంటే..మరింతమంది బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు
- Author : Sudheer
Date : 22-11-2024 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
రేయ్ .. ఎవర్రా మీరంతా (Rey evarra meerantha) ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.యుగానికిఒక్కడు మూవీ లో కార్తీ ఈ డైలాగ్ చెప్పాడు. ఆ అప్పుడు ఈ డైలాగ్ పెద్దగా తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ ఈ డైలాగ్ ను వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా AI టెక్నలాజి వాడుతూ సరికొత్త వీడియోలు సృష్టిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఈ వీడియో లు చూసిన వారంతా వారి మేధస్సుకు రేయ్ .. ఎవర్రా మీరంతా..అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా AI టెక్నలాజితో పుష్ప 2 ట్రైలర్ (Pushpa 2 Trailer) నే మార్చిసి వైరల్ చేసారు.
వరల్డ్ వైడ్ గా పుష్ప మేనియా నడుస్తుంది. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్..పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ ..ఇలా యావత్ సినీ ప్రేక్షకులు పుష్ప డైలాగ్స్ మాట్లాడుకుంటూ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత తో ఉన్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ (Sukumar – Allu Arjun) కలయికలో తెరకెక్కిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. రష్మిక అయితే నేషనల్ క్రాష్ అయిపోయింది. ఇలా ఈ సినిమాలో నటించిన నటీనటులే కాదు సాంకేతిక వర్గం వారు కూడా చాల ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పుడు యావత్ సినీ లోకం పుష్ప 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనికి ఉదాహరణే తాజాగా సృష్టించిన ట్రైలర్ వ్యూస్. కేవలం 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సినిమా పై ఎంత ఆసక్తి గా ఉన్నారో చెప్పకనే చెప్పారు.
తాజాగా AI టెక్నలాజి తో పుష్ప 2 ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలను మార్చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి కొంతమంది నవ్వుకుంటూ ఏమైనా చేసారా..వారి ఐడియా సూపర్బ్ అని ప్రశంసిస్తుంటే..మరింతమంది బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఆ వీడియో ఎలా ఉందో మీరే చూసెయ్యండి.
Rey yevadra idhi chesindhi😂😂😂 pic.twitter.com/Nv0HP7jCDI
— 🕷️ (@Pandu_Prabhas19) November 21, 2024
Read Also : Naga Chaitanya : భారీ బడ్జెట్ తో నాగ చైతన్య మూవీ.. సూపర్ హిట్ డైరెక్టర్ తో మూవీ..!