Jr NTR: ఆస్కార్ తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎగబడ్డ ఫ్యాన్స్
ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో అడుగు పెట్టారు.
- By Balu J Published Date - 01:14 PM, Wed - 15 March 23

ఆస్కార్ (Oscar) అవార్డుల కార్యక్రమం ముగిసిపోవడంతో ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో అడుగు పెట్టారు. బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తారక్ (Jr NTR) కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ ఆస్కార్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భావోద్వేగంతో ప్రసంగించారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకున్న క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను.. ముఖ్యంగా కీరవాణి, చంద్రబోస్ స్టేజ్ మీద ఆస్కార్ తీసుకున్న క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అన్నారు ఎన్టీఆర్.
ఈ వేడుకల్లో భాగం అయినందకు చాలా సంతోషంగా ఉంది. నాజీవితంలో ఇవి బెస్ట్ మూమెంట్స్..మన దేశంలాగానే ఈ అవార్డ్ కూడా గొప్పగా ఉంది. ఇదోక అద్భుతమైన అనుభవం.. ఈ సంతోషాన్ని మాట్లల్లో చెప్పలేను అంటూ.. ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. అంతే కాదు భారతీయుడిని.. అందులోను తెలుగువాడిగా పుట్టినందకు గర్విస్తున్నాను అన్నారు (Jr NTR) తారక్.
మేము ఇంతటి ఘనత సాధించాము అంటే దానికి కారణం అభిమానులు, ప్రేక్షకులు. మమ్మల్ని ఇంతలా ఆదరించిన మీవల్లే ఇది సాధ్యం అయ్యింది. రాజమౌళి చేతిలో ఆస్కార్ ను చూసినప్పుటు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన కష్టం వృధా కాలేదు. ఇక ఆస్కార్ కోసం తమను ప్రోత్సహించిన సినీ ప్రేమికులకు, అందరికి పేరు పేరున కృతజ్ఞతు తెలిపారు ఎన్టీఆర్. అవార్డ్ వచ్చిన వెంటనే తాను తన భార్యకు ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నట్టు తెలిపారు ఎన్టీఆర్. అయితే ఇవాళ శంషాబాద్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ (Jr NTR) ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fans 💥
#JrNTR arrives hyd from oscars @tarak9999 pic.twitter.com/QLWSdPVnMZ— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 14, 2023

Related News

RRR Oscar Campaign: ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. విమర్శలకు చెక్..!
ఆర్ఆర్ఆర్' (RRR) విడుదలైన ఏడాది తర్వాత కూడా నిరంతరం వార్తలను సృష్టిస్తోంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రంలోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది.