Ram Pothineni : మెగాస్టార్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ తో హరీష్ శంకర్..!
Ram Pothineni టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇయర్ ఎండింగ్
- Author : Ramesh
Date : 10-05-2024 - 3:33 IST
Published By : Hashtagu Telugu Desk
Ram Pothineni టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు హరీష్ శంకర్.
ఇదిలాఉంటే హరీష్ శంకర్ చిరు సినిమా తర్వాత తన హీరో ని ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. చిరు సినిమా తర్వాత హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తాడని టాక్. రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే రామ్ కొద్దిపాటి గ్యాప్ తోనే హరీష్ శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.
హరీష్ శంకర్, రామ్ ఈ కాంబో ఆడియన్స్ అసలు ఊహించలేదు. తను చేసేది స్ట్రైట్ స్టోరీ అయినా రీమేక్ స్టోరీ అయినా ఆడియన్స్ ని మెప్పించేలా చేస్తూ వస్తున్న హరీష్ శంకర్ రామ్ తో చేసే సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. రామ్ ఫ్యాన్స్ అంతా ఈ కాంబో చాలా ఎగ్జైటెడ్ గా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read : Viswak Sen Gangs of Godhavari : మాస్ సాంగ్ తో గోదావరి గ్యాంగ్..!