Bobby Deol Udhiran : యానిమల్ తర్వాత పర్ఫెక్ట్ మూవీ.. సూర్య కంగువలో బాబీ డియోల్ లుక్ చూశారా..?
Bobby Deol Udhiran సందీప్ రెండ్డి వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. సినిమా చూసిన ఆడియన్స్ అంతా సందీప్ వంగ మ్యాడ్ నెస్
- Author : Ramesh
Date : 27-01-2024 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
Bobby Deol Udhiran సందీప్ రెండ్డి వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా సృష్టించిన సంచలనాలు తెలిసిందే. సినిమా చూసిన ఆడియన్స్ అంతా సందీప్ వంగ మ్యాడ్ నెస్ కి ఫిదా అయ్యారు.
We’re now on WhatsApp : Click to Join
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎగ్జైటింగ్ గా ఉన్న ఆడియన్స్ కి తన మార్క్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. బాబీ డియోల్ కి కూడా ఈ సినిమా సూపర్ కంబ్యాక్ ఇచ్చింది.
యానిమల్ సినిమా సక్సెస్ ని హీరో రణ్ బీర్ కపూర్ కన్నా విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎక్కువ ఎంజాయ్ చేశాడు. తను ఎక్కడికి వెళ్లినా యానిమల్ సినిమా విషయాలను పంచుకోవడంతో అతను కొన్నిసార్లు ఎమోషనల్ కూడా అయ్యాడు. అయితే బాబీ డియోల్ తిరిగి ఫాం లోకి రావడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి.
యానిమల్ సెట్స్ మీద ఉన్నప్పుడే సూర్య కంగువ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు బాబీ డియోల్. శివ డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తుంది. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఉధిరన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నాడు. సినిమాలో అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read : Rajamouli Mahesh : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. రాజమౌళి సినిమాకు మహేష్ ప్లాన్ ఏంటి..?
సూర్య వేషధారణతో పాటుగా ప్రతి నాయకుడు బాబీ డియోల్ లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా తో బాబీ డియోల్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.