Deepika Padukone: దీపిక పదుకొనెపై కేసు నమోదు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె (Deepika Padukone)పై కేసు నమోదైంది. ఇటీవల పఠాన్ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్‌లో దీపిక పదుకొనె (Deepika Padukone) వస్త్రాధారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాచార, ప్రచారశాఖ న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Author : Gopichand
Date : 16-12-2022 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె (Deepika Padukone)పై కేసు నమోదైంది. ఇటీవల పఠాన్ మూవీ నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’ సాంగ్‌లో దీపిక పదుకొనె (Deepika Padukone) వస్త్రాధారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాచార, ప్రచారశాఖ న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు నెటిజన్లు సైతం దీపికపై ఫైర్ అవుతున్నారు. తను ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్లే బాలీవుడ్ ఇంకా పతనమైందని ఆరోపిస్తున్నారు.
పఠాన్ మూవీ షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయినా దగ్గర నుంచి బాలీవుడ్ పతనం మొదలయ్యిందని విమర్శలు గుప్పుమన్నాయి. ముఖ్యంగా దీపికా డ్రెస్సింగ్ ఈ వివాదానికి దారి తీసింది.
Also Read: TRS MLAs poaching case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు తుది వాదనలు
కాషాయ రంగు బికినీలో అమ్మడి అందాల ఆరబోత హద్దులు దాటి ఉంది. ఇప్పటికే ఈ పాటపై మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఆ సీన్లు, ఆ డ్రెస్ ను తొలగిస్తే సినిమాను ఉంచుతామని, లేకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని చెప్పుకొచ్చారు. అసలు పెళ్లి తరువాత దీపికా బికినీ వేసుకోవడం అందాలను చూపించడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక తాజాగా దీపికా పై కేసు కూడా నమోదు అయ్యింది. సమాచార ప్రచార శాఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సీన్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.