Nanditha Swetha: గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన నందిత!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
- By Balu J Updated On - 12:08 PM, Sat - 30 April 22

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా స్టార్ల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతిఒక్కరు ఈ ఛాలెంజ్ ను ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లు తమ పుట్టినరోజు సందర్భంగా విధిగా మొక్కలు నాటడం అలవర్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని, జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి నందిత శ్వేత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందిత శ్వేత మాట్లాడుతూ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్కలు, చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు, యువత తమ పుట్టినరోజు నాడు కచ్చితంగా మొక్కలు నాటి, పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.
Related News

High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు మంగళవారం సిఫార్సు చేసింది.