Actress Meena: రెండో పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన మీనా.. సెన్సేషన్ కావడానికి ఊరికే రాసేస్తారా అంటూ?
- By Sailaja Reddy Published Date - 06:04 PM, Sun - 24 March 24
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా దృశ్యం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రులను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే అప్పట్లో మీనా రజినీకాంత్,చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
అంతేకాకుండా అప్పట్లోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఆమె కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. కెరిర్ మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సమయంలోనే వ్యాపారవేత్తగా విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. అయితే 2022లో మీనా భర్త అనారోగ్య సమస్యలతో మరణించారు. అయితే చాలాకాలంగా మీనా రెండో పెళ్లి గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వీటిపై అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. మరోసారి సెకండ్ మ్యారేజ్ రూమర్స్ పై స్పందించింది.
డబ్బు కోసం.. సెన్సెషన్ కావడానికి ఏమైనా రాసేస్తారా ?సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకోని రాయాలి. అలా వాస్తవాలు తెలుకుని రాస్తే అందరికి మంచింది అని తెలిపింది మీనా. దేశంలో తనలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారు. తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి రాయాలి. ప్రస్తుతం రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా చెబుతాను అని చెప్పుకొచ్చింది మీనా.
Related News
Jabardasth Varsha: స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ కాలర్ పట్టుకున్న వర్ష.. అసలు ఏం జరిగిందంటే?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన వర్షా ఆ తర్వాత సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే వర్ష ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే పలు పండుగ ఈవెంట్ లో చేస్తూ బాగా పాపులార�