Kavya Kalyan Ram: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో కావ్య కళ్యాణ్ రామ్!
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు.
- By Balu J Published Date - 02:16 PM, Wed - 21 September 22

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి కావ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్ష లాది మొక్కలు నాటడం అందులో చిన్న, పెద్ద సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని భాగస్వామ్యం చెయ్యడం ఆనందంగా ఉంది అన్నారు.
రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మసుధ మూవీ టీమ్ అందరూ మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
It was a pleasure to take part in the #GreenIndiaChallenge. Thank you @MPsantoshtrs garu for this wonderful initiative. I hope we all continue to plant more trees and nurture them! pic.twitter.com/UGXTDU4ZTR
— KavyaKalyanram (@KavyaKalyanram) September 21, 2022
Related News

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణలా మహేష్ బాబు కూడా.. అలా ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు..
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా.. ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. కొన్ని కొత్త పద్ధతులు టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నాడు.