Site icon HashtagU Telugu

Kavya Kalyan Ram: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో కావ్య కళ్యాణ్ రామ్!

Kavya1

Kavya1

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో నటి కావ్య కళ్యాణ్ రామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి కావ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్ష లాది మొక్కలు నాటడం అందులో చిన్న, పెద్ద సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని భాగస్వామ్యం చెయ్యడం ఆనందంగా ఉంది అన్నారు.

రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మసుధ మూవీ టీమ్ అందరూ మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

Exit mobile version