Anjali Reaction: మ్యారేజ్ రూమర్స్ పై అంజలి రియాక్షన్!
పెళ్లి వార్తలపై హీరోయిన్ అంజలి రియాక్ట్ అయ్యింది.
- Author : Balu J
Date : 13-12-2022 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు భామ అంజలి (Anjali)కి తమిళనాడులో కూడా చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం తమిళ, తెలుగు (Tollywood) భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. తాజాగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అంతేకాదు, ఐటెం సాంగ్స్ లలో కూడా తళుక్కున మెరుస్తోంది. గతంలో తమిళ హీరో జైతో అంజలి ప్రేమలో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇది నిజమే అన్నట్టుగా వీరిద్దరూ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరూ దూరమయ్యారు.
సరైన సమయంలోనే
ఈ క్రమంలో తాజాగా అంజలి (Anjali) పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ… తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు రకరకాలుగా ప్రచారం జరుగుతోందని… ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని తెలిపింది. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని… సమయం వచ్చినప్పుడు తన వివాహం జరుగుతుందని చెప్పింది.
Also Read: Chiru Wish To Venky: డియర్ వెంకీ ‘హ్యాపీ బర్త్ డే’.. వేర్ ఈజ్ ద పార్టీ?