Ravi Kishan: తెలుగు మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవి కిషన్.. సినిమాల్లో అలాంటివి చూపించడం మానేయాలంటూ?
- By Sailaja Reddy Published Date - 12:47 AM, Fri - 1 March 24
![Ravi Kishan: తెలుగు మూవీస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవి కిషన్.. సినిమాల్లో అలాంటివి చూపించడం మానేయాలంటూ?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/03/MixCollage-01-Mar-2024-12-52-PM-8682.jpg)
నటుడు, విలన్ రవి కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి రాకముందు భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు రవికిషన్. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి కిషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి షాకింగ్
కామెంట్స్ చేశారు..
ఈ సందర్బంగా రవికిషన్ మాట్లాడుతూ.. భోజ్ పురి అనగానే చాలా మందికి అలాంటి చిత్రాలే గుర్తొస్తాయని అక్కడ సరైన సినిమాలే ఉండవని భావిస్తూ ఉంటారు. ఈ పరిస్థితులు చాలా వరకు మారాల్సి ఉందని అన్నారు. ఇప్పటికే నేను భోజ్ పురి ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించాను. మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమాతో నేను భోజ్ పురి ఇండస్ట్రీని మార్చడానికి ప్రయత్నించాను. భోజ్ పురి సినిమా మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న వ్యక్తిని నేను. అక్కడ వచ్చే పాటలు, ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను రాజకీయంలోకి రావడం వల్ల అంతగా పట్టించుకోలేదు. కానీ నేనిప్పుడు భోజ్ పురి ఇండస్ట్రీని మార్చాలనుకుంటున్నాను. మహాదేవ్ కా గోరఖ్ పూర్ సినిమా చేశాను. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం ప్రజల ఆలోచనలను మారుస్తుంది.
అక్కడున్న జూనియర్ నటీ నటులందరూ కొత్తగా సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తున్నారు. అలాంటి పాటలు, డైలాగ్స్ లేకుండా మంచి చిత్రాలు చేస్తారని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు రవి కిషన్. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతోపాటు పుష్ప వంటి సినిమాలను ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. భోజ్ పురి ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాజ్ కుమార్ బర్జాత్యా, యష్ చోప్రా మంచి చిత్రాలను తీశారు. వారి సినిమాల్లో అసభ్యకరమైన కంటెంట్ ఉండదు. భోజ్ పురి కూడా మంచి సినిమాలను తీయాలి. రచయితలకు పారితోషికం ఇవ్వాలి. హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి రచయితలకు, టెక్నీషియన్లకు తగ్గించకూడదు. ఇప్పుడు మలయాళీ సినిమాలు కూడా మంచిగా తీస్తున్నారు. ఇప్పుడు వారు ఎలా అగ్రస్థానంలో ఉన్నారో తెలుసుకోవాలి అని అన్నారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Rajamouli Mahesh Movie Title : మహేష్ కి పర్ఫెక్ట్ టైటిల్.. రాజమౌళి ప్లాన్ అంటే అలానే ఉంటుందిగా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/03/Rajamouli-Master-Plan-for-Mahesh-Movie-RRR-Combination-Repeate.jpg)
Rajamouli Mahesh Movie Title : మహేష్ కి పర్ఫెక్ట్ టైటిల్.. రాజమౌళి ప్లాన్ అంటే అలానే ఉంటుందిగా..?
గోల్డ్ అంటే బంగారం లా మెరిసిపోతుందనో లేదా బంగారం అంత కాస్ట్ లీ అనో కానీ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి జరుగుతుంది.