Actor Brahmaji Viral: నెటిజన్‌కు నటుడు బ్రహ్మాజీ హెచ్చరిక.. వైరల్ అవుతున్న ట్వీట్
- Author : Hashtag U
Date : 31-08-2022 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. అభిమానులు సరదా కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు.
What’s happening..? pic.twitter.com/ggnrkyCS8G
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022
Uncle entra.. uncle u.. case vestha.. age.. body.. shaming aa.. 😜 https://t.co/9fbRbXirbJ
— Brahmaji (@actorbrahmaji) August 30, 2022
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తనను ఆంటీ అని సంబోధించిన నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించిన ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ అన్నట్టుగానే రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అలా హెచ్చరించిన తర్వాత ట్విట్టర్‌లో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. మీమ్స్‌తో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ తనను అంకుల్ అంటే కేసు పెడతానన్న సెటైరికల్ ట్వీట్‌ను ‘గుడ్ టైమింగ్’ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.