Himachal Floods: హిమాచల్ ప్రదేశ్‌కు అమీర్ రూ.25 లక్షల ఆర్హిక సహాయం
సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది.
- Author : Praveen Aluthuru
Date : 24-09-2023 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
Himachal Floods: సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఎందరో నిరాశ్రయులయ్యారు. అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అమీర్ ఖాన్ చొరవ తీసుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అమీర్ ఖాన్‌కు ట్వీట్‌లో ధన్యవాదాలు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అత్యవసర సహాయ పథకానికి బాలీవుడ్ సుర్‌స్టార్ 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు అమీర్‌కి ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఈ సాయం అందుతుందని కూడా హామీ ఇచ్చారు. కాగా అమీర్ హిమాచల్ ప్రదేశ్ లో అనేక చోట్ల సినిమా షూటింగ్స్ జరిగాయి. అక్కడి ప్రజలతో అమీర్ కు అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్లిష్ట సందర్భంలో అమీర్ ఖాన్ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
Also Read: Rahul Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్