HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >A Real Beggar Plays Key Role In Chiranjeevi Movie

Anji Movie : చిరంజీవి సినిమా కోసం నిజంగా ఒక బిచ్చగాడిని తీసుకువచ్చి షూట్ చేశారు..

చిరంజీవి సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం రోడ్డు పక్కన బిచ్ఛం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడితో ఓ పాత్ర చేయించారట.

  • By News Desk Published Date - 07:00 PM, Sat - 13 January 24
  • daily-hunt
A Real Beggar Plays Key Role in Chiranjeevi Movie
A Real Beggar Plays Key Role in Chiranjeevi Movie

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాల్లో నటించేందుకు హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఆయన సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం రోడ్డు పక్కన బిచ్ఛం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడితో ఓ పాత్ర చేయించారట. ఇక్కడ విశేషం ఏంటంటే.. అతడి సీన్ తోనే సినిమా మొదలవుతుంది. అంతేకాదు సినిమాకు ఆ సన్నివేశం ఒక మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక సీన్ ని ఏమాత్రం యాక్టింగ్ తెలియని ఓ వ్యక్తిని తీసుకొచ్చి షూట్ చేశారా..? ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఆ పాత్ర ఏంటి..?

చిరంజీవి కెరీర్ లో ఆ సినిమా సక్సెస్ కాలేకపోయినా తెలుగు తెరపై ఒక వండర్ గా నిలిచిపోయిన చిత్రం ‘అంజి'(Anji). శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ గ్రాఫికల్ వండర్ మూవీ.. 2004లో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించుకుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా స్టార్టింగ్ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సన్నివేశంలో ఒక మాంత్రికుడు ఆత్మలింగం కోసం ప్రయత్నిస్తూ చనిపోతాడు. ఆ మాంత్రికుడు పాత్రని పోషించింది ఓ బిచ్చగాడు.

హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రి దగ్గర బిచ్ఛం ఎత్తుకునే ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడికి శిక్షణ ఇచ్చి ఆ పాత్రని చేయించారట. ఈ విషయాన్ని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు పాటు కష్టపడ్డారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి 100 నుంచి 120 షాట్స్‌ వరకు తీయాల్సి వచ్చేదట. ఆ తరువాత ఆ తీసిన షాట్స్ ని సింగపూర్‌, మలేషియా, అమెరికాకి పంపించి అక్కడ గ్రాఫిక్స్ వర్క్స్ చేయించేవారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి ధరించిన డ్రెస్సుని ఐదేళ్ల పాటు వాష్ చేయకుండానే ఉపయోగించారట. వాష్ చేస్తే ఎక్కడ కలర్ చేంజ్ వస్తుందో అని అలాగే ఉపయోగించారట. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఇప్పటికి అంజి ఒక విజువల్ వండర్.

Anji

 

 

Also Read : Mahesh Babu : ఇంగ్లీష్ లెటర్స్‌లో.. ఆల్మోస్ట్ అన్ని అక్షరాలపై యాడ్స్ చేసేసిన మహేష్.. రికార్డ్ సెట్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anji Movie
  • beggar
  • chiranjeevi

Related News

    Latest News

    • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

    • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

    • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    Trending News

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd