Hero Rana: నిర్మాత సురేష్ బాబు, హీరో రానాలపై పోలీసు కేసు నమోదు
హీరో దగ్గుబాటి రానా (Hero Rana)పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపైన కూడా కేసు నమోదు చేశారు.
- Author : Gopichand
Date : 11-02-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
హీరో దగ్గుబాటి రానా (Hero Rana)పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపైన కూడా కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ భూ వివాదంలో దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేష్ బాబు ఒప్పందం అమలు చేయడం లేదని బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్
తొలుత వ్యాపారి ప్రమోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని హెచ్చరించారని, బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపిస్తున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రానా, సురేష్ బాబుతో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.