OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్
OG : సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే, 'ఓజీ' సినిమాకు సంబంధించిన పూర్తి HD ప్రింట్ ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెలిగ్రామ్ గ్రూపులు, పలు వెబ్‌సైట్లలో ఈ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కు గురి చేసింది
- By Sudheer Published Date - 11:20 AM, Fri - 26 September 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan) అభిమానులకు, ‘ఓజీ’ (OG) చిత్ర బృందానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఇది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అంచనాలతో, భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు, తొలి షోల నుంచే పాజిటివ్ టాక్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా థియేటర్లు కిక్కిరిసిపోయి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సమయంలో, ఊహించని విధంగా పైరసీ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది.
OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్
సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే, ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన పూర్తి HD ప్రింట్ ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెలిగ్రామ్ గ్రూపులు, పలు వెబ్‌సైట్లలో ఈ ప్రింట్ ప్రత్యక్షం కావడం అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాపై పైరసీ ప్రభావం చూపిస్తే కలెక్షన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను దొంగిలించి, ఆన్‌లైన్‌లో ఉంచిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్ విభాగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి కంటెంట్‌ను ప్రోత్సహించాల్సిన సమయంలో, ఇలాంటి పైరసీ చర్యలు నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నిజానికి ఇటీవల కాలంలో ఏ పెద్ద సినిమా విడుదలైనా, గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం ఒక దురదృష్టకర ట్రెండ్‌గా మారింది. కోట్లాది రూపాయల పెట్టుబడితో, వందలాది మంది శ్రమతో తెరకెక్కే సినిమాలకు ఈ పైరసీ పెను శాపంగా మారింది. దీనిని అరికట్టడానికి సినీ పరిశ్రమ, ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభిమానులు కూడా థియేటర్లలోనే సినిమా చూసి, సినీ పరిశ్రమను మద్దతుగా నిలబడాలి.