Box Office : రేపు తెలుగులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?
ప్రతి వారం పలు సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఆకట్టుకోగా..మరికొన్ని మాత్రం ప్లాప్ గా మిగిలిపోతుంటాయి. ఈ క్రమంలో రేపు (ఆగస్టు 2) ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి
- By Sudheer Published Date - 09:38 PM, Thu - 1 August 24

శుక్రవారం (Friday) వస్తుందంటే సినీ లవర్స్ (Cine Lovers) కు పెద్ద పండగే..అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న చితక హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ప్రతి వారం పలు సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఆకట్టుకోగా..మరికొన్ని మాత్రం ప్లాప్ గా మిగిలిపోతుంటాయి. ఈ క్రమంలో రేపు (ఆగస్టు 2) ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లు శిరీష్ నటించిన బడ్డీ, వరుణ్ సందేశ్ నటించిన విరాజి , రాజ్ తరుణ్ – మాల్వి నటించిన తిరగబడరా. ఈ మూడు సినిమాలు తమ అదృష్టిని పరీక్షించుకోబోతుండగా..అన్నింటికీ కంటే ఎక్కువగా రాజ్ తరుణ్ సినిమా ఫై ఆసక్తి నెలకొని ఉంది. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
We’re now on WhatsApp. Click to Join.
రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం వల్ల ‘తిరగబడరా’ చిత్రాన్ని ఫ్రీ హైప్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వి ప్రేమలో పడి తనను దూరం పెట్టాడని చెప్పి..లావణ్య ఏకంగా పోలీసు కేసు పెట్టడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఈ సినిమా ప్రమోషన్ లో కూడా మీడియా అంత కూడా లావణ్య కు సంబదించిన ప్రశ్నలతో హోరెత్తించారు. ఇలా ఈ వ్యవహారం తో తిరగబడరా సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది..? సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి గా ఉన్నారు.
ఈ మూవీ తర్వాత అల్లు శిరీష్ నటించిన బడ్డీ పై కాస్త ఆసక్తి నెలకొంది. టెడ్డీ బేర్ చుట్టూ కథ తో ఈ మూవీ రాబోతుంది. వాస్తవానికి జులై 26న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడి రేపు ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు.
ఇక వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్‌తో వస్తున్న మూవీ విరాజీ. హారర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది ఓ సినిమా రీమేక్‌లా కనిపిస్తుంది. ఈ మూవీ ని ఆద్యనాథ్ హర్ష తెరకెక్కించాడు. ప్రమోదిని, రఘు కారుమంచి కీలక పాత్రలు పోషించారు. వీటితో పాటు ఫ్యామిలీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఉషా పరిణయం అనే మూవీని రూపొందించాడు. సరికొత్త ప్రేమకథా చిత్రంగా రాబోతుంది. అలాగే అలనాటి రామచంద్రుడు అనే సినిమా కూడా ఆగస్టు 2న రాబోతుంది. కృష్ణ వంశీ,మోక్ష హీరో హీరోయిన్లు. మరి ఈ ఐదు సినిమాల్లో ఏది ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : Padmanabha Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు లేఖ