Padmanabha Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు లేఖ
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై ఆర్గనైజ్డ్ ఆన్‌లైన్ ట్రోలింగ్ వేధింపులు మరియు భౌతిక బెదిరింపులు..
- Author : Latha Suma
Date : 01-08-2024 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
M. Padmanabha Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టులపై నిరంతరం జరుగుతున్న ఆర్గనైజ్డ్ ఆన్‌లైన్ ట్రోలింగ్, వేదింపులు మరియు భౌతిక బెదిరింపులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. జాగరూకులైన పౌరసమాజంతో ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారము పౌరులకు వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇది పత్రికా రంగానికి కూడ ఈ స్వేచ్ఛ వర్తిస్తుంది. గత కొంతకాలంగా భారతదేశం అంతటా మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో పత్రిక స్వేచ్ఛ తగ్గుతున్నట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్షలు లేకుండా లేదా ప్రభుత్వజోక్యం లేకుండా జర్నలిస్టులు , మీడియా సంస్థలు పనిచేయడానికి అనుమతించే ప్రాథమిక సూత్రం భావ ప్రకటన, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సమాజానికి ముఖ్యమైనది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై ఆర్గనైజ్డ్ ఆన్‌లైన్ ట్రోలింగ్ వేధింపులు , భౌతిక బెదిరింపులు పెరుగుతున్న ఉదంతాలు జరుగుతున్నాయి. ఈ దుష్ప్రవర్తన కేవలం పత్రికా స్వేచ్ఛను చిన్నబుచ్చడమే కాకుండా ప్రజాస్వామ్యాన్న కాపాడే జర్నలిస్టుల రక్షణకు, భద్రతకు గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టులు వార్తలు అందిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్ వేధింపులు, వారిని కలవరపరుస్తున్నాయి. అలాగే దుర్భాషల ద్వార మనస్థాపానికి గురికాబడుతున్నారు. కొన్ని అతి తీవ్రమైన కేసులలో వారి మీద క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయబడుతుంది. ఇది స్పష్టంగా వారి గొంతులను నొక్కడం మరియు స్వేచ్ఛా భావ ప్రకటనను తగ్గించే ప్రయత్నాలు . రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని ఆర్గనైజ్డ్ ట్రోల్ ఫారమ్స్, వార్ రూములను నిర్వహిస్తూ వారిని నిరంతరం ఆన్‌లైన్ ద్వార దుర్భాషలకు గురిచేస్తున్నాయి.