Balakrishna : బాలకృష్ణ కోసం 3 టైటిల్స్.. బాబీ ప్లానింగ్ అదుర్స్..!
Balakrishna 3 టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. బాలకృష్ణ కోసం ఈ మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఐతే ఈ మూడు టైటిల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా
- By Ramesh Published Date - 02:43 PM, Sat - 2 November 24

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కె.ఎస్ బాబీ కాంబోలో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అసలైతే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమాను సంక్రాంతి రేసులో దించుతున్నారు. ఎన్.బి.కె 109గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 3 టైటిల్స్ లో ఒకటి పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇంతకీ ఆ మూడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఒకటి డాకు మహరాజ్, రెండోది సర్కార్ సీతారాం, మూడోది అసురుడు.
ఈ 3 టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. బాలకృష్ణ కోసం ఈ మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఐతే ఈ మూడు టైటిల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఉంది. ఆల్రెడీ సీతారామం వచ్చింది కాబట్టి సర్కార్ సీతారాం అంటే క్యాచీగా ఉంటుందని అది పెడతారా లేదా డాకు మహరాజ్ అని ఫిక్స్ చేస్తారా అన్నది చూడాలి.
బాలయ్య టైటిల్..
నారా రోహిత్ ఆల్రెడీ అసుర టైటిల్ వాడేశాడు. అసురుడు అనే టైటిల్ తో కూడా సినిమా వచ్చింది. మరి అసుర ని బాలయ్య టైటిల్ గా పెడతారా అన్నది చూడాలి. NBK109 సినిమాకు ఈ 3 టైటిల్స్ లో ఏది పర్ఫెక్ట్ అని అనుకుంటారో చూడాలి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ (Sraddha Srinath) నటిస్తుంది.
అంతేకాదు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెల కూడా ఈ సినిమాలో భాగం అవుతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది. సంక్రాంతికి ఆల్రెడీ చరణ్ (Ram Charan) వస్తున్నాడు. వెంకటేష్ కూడా సన్ర్కాంతికి వస్తున్నాం అంటూ పొంగల్ రేసులో దిగుతున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read : Manchu Vishnu Kannappa : కన్నప్ప రిలీజ్.. మంచు హీరో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు..?