10th Class Diaries: ట్రైలర్ అద్భుతంగా ఉంది.. టెన్త్ రోజులు గుర్తుకొస్తాయి!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.
- By Balu J Published Date - 10:00 PM, Wed - 26 January 22
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ “చిన్నాతో నాది 40 ఏళ్ల స్నేహం. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు అతను మ్యుజిషియన్. చిన్నా నేపథ్య సంగీతం చేయడం అనేది నాతో మొదలైంది. నేను, శివమణి, ఎస్పీ బాలు, చిన్నా… మేమంతా బ్యాచ్. సినిమా ఇండస్ట్రీలో ఒక చేతికి ఇంకో చేయి తోడైతేనే సక్సెస్ వస్తుంది. ఒక్కడితో ఎప్పుడూ సక్సెస్ రాదు. మా గురువుగారు ఎప్పుడూ అదే చెప్పేవారు. నిర్మాత అచ్యుత రామారావు తమకు ఇంకో ముగ్గురు తోడయ్యారని చెబితే సంతోషం అనిపించింది. అభినయం పరంగా సౌందర్య తర్వాత అవికా గోర్ అంటే ఇష్టం. ఆ అమ్మాయికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. తనకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. పనిలో అంజి చిచ్చరపిడుగు. రైటర్ దర్శకుడు అయితే… ప్రతి సీన్, డైలాగ్ మీద ప్రేమతో ఉంచుతారు. చివరకు, నిడివి సమస్య వస్తుంది. కెమెరామెన్ డైరెక్టర్ అయితే… ప్రతి షాట్, సన్నివేశంలో తన ప్రతిభ చూపించాలని అనుకుంటాడు. ప్రేమను కూడా పక్కనపెట్టి పనిచేసే వ్యక్తి అంజి. వందో సినిమా వరకూ డైరెక్షన్ చేస్తాడు. రామారావుగారు మంచి సినిమా చేయాలని తాపత్రయపడ్డారు.
చిత్రనిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ “మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సి. కళ్యాణ్ గారు, బీవీఎస్ రవి గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, ఛోటా కె. ప్రసాద్ గారు… అతిథులు అందరికీ థాంక్స్. మా టెన్త్ క్లాస్మేట్స్ అందరూ రీయూనియన్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన పాయింట్స్ తీసుకుని సినిమా చేశాం. మేం ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత కొంచెం పెరుగుతూ ఉందని అనుకున్నప్పుడు… మనకు సపోర్ట్ అవసరమని మేం అడగ్గానే ఏఏకే క్రియేషన్స్ నుంచి రవి కొల్లిపర సపోర్ట్ చేశారు. ఆయనతో పాటు అజయ్ మైసూర్ కూడా మాతో జాయిన్ అయ్యారు. సినిమా విడుదలకు ముందు నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నానంటే కారణం వాళ్లే. నాకు బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది. తప్పకుండా హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది. కాబట్టి చాలా రిలాక్స్డ్ గా ఉన్నాను. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి మనిషి చూడాల్సిన సినిమా ఇది. ఆ అనుభూతులు గుర్తు వస్తాయి.
‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ “మా టీజర్ విడుదల చేసిన ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు. ఎస్ఆర్ మూవీ మేకర్స్ రామారావు గారు, రవితేజగారు మంచి కథతో నా దగ్గరకు వచ్చారు. సినిమాటోగ్రాఫర్‌గా నా 50వ సినిమాకు నేను డైరెక్షన్ చేయాలనే డ్రీమ్ నాకు లేదు. మా నిర్మాతలకు వచ్చింది. కథ విన్నాను. సుజీత్ మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. నాకు పూర్తిగా సహకరించిన సురేష్ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్ పూడి, ఇతరులు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు అవికా గోర్ పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్‌లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. రామారావుగారు చెప్పినట్టు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం పెరిగింది. ఆయనకు మద్దతుగా రవి, అజయ్ మైసూర్ వచ్చారు. ’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఉంటుంది” అని అన్నారు.
అవికా గోర్ మాట్లాడుతూ “నా టెన్త్ క్లాస్ నాకు ఎంతో స్పెషల్. పదో తరగతిలో ఉన్నప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ చేశా. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారు. అందువల్ల, పదో తరగతి నాకెప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా చూసి మీరంతా ఎలా ఉందో చెబుతారని ఆశిస్తున్నాను. నన్ను బబ్లీ, చబ్బీ రోల్స్‌లో చూశారు. ఈ రోల్ చాలా డిఫరెంట్ ” అని అన్నారు.
నేపథ్య సంగీత దర్శకుడు చిన్నా, రైటర్ సుజీత్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, వైబ్రెంట్ మీడియా శివ – శ్రీను, ప్రభాస్ మేనేజర్ ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�