Uber Auto : ఉబెర్‌లో ఆటో బుక్ చేసుకుంటారా ? కొత్త అప్‌డేట్ మీకోసమే
ఒకరికి మించి ప్రయాణికులు ఉన్న సందర్భాల్లో ఉబెర్ ఆటో సర్వీసు(Uber Auto)ను ఎంచుకోవడం అనేది ఉత్తమమైన ఆప్షన్.
- By Pasha Published Date - 06:32 PM, Thu - 20 February 25

Uber Auto : రోజూ ఎంతోమంది ఉబెర్ క్యాబ్ సర్వీసులను వినియోగిస్తుంటారు. ఉబెర్ యాప్ ద్వారా బైక్‌లు, కార్లు, ఆటోలను బుక్ చేసుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉబెర్ వాహన సేవలకు మంచి గుర్తింపు దక్కింది. యావత్ దేశంలోనూ ఉబెర్ బాగానే విస్తరించింది. ఉబెర్ సేవలకు సంబంధించిన ఒక కొత్త అప్‌డేట్ వచ్చింది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Threat To Shinde: కారును బాంబుతో పేల్చేస్తాం.. డిప్యూటీ సీఎంకు హత్య బెదిరింపు
క్యాష్ పేమెంట్ మాత్రమే
ఒకరికి మించి ప్రయాణికులు ఉన్న సందర్భాల్లో ఉబెర్ ఆటో సర్వీసు(Uber Auto)ను ఎంచుకోవడం అనేది ఉత్తమమైన ఆప్షన్. ఈ సర్వీసులో మనకు కంఫర్ట్‌తో పాటు డబ్బు ఆదా లభిస్తుంది. ఒకవేళ ఉబెర్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకుంటే అంతకంటే డబుల్ ఛార్జీని చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటిదాకా ఉబెర్‌లో ఆటోలను బుక్ చేసుకునే వారు డిజిటల్/ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం ఉండేది. ఇక ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఉబెెర్ ఆటోరిక్షాలను బుక్ చేసుకునే వారు తప్పకుండా క్యాష్ పేమెంట్ మాత్రమే చేయాలి. ఆటోరిక్షా డ్రైవరుకు, ప్రయాణికుడికి మధ్య జరిగే లావాదేవీలో ఉబెర్ అస్సలు జోక్యం చేసుకోదు. తమ దగ్గర పేర్లను రిజిస్టర్ చేసుకున్న ఆటో డ్రైవర్లను సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రయాణికులతో కనెక్ట్ చేయడానికి ఉబెర్ పరిమితం కానుంది. ఉబెర్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నందుకు ప్రతిగా ఆటో డ్రైవర్లు ఏటా కొంత మొత్తాన్ని ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
Also Read :BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
ప్రయాణికులు ఇక బేరమాడొచ్చు
ఆటో డ్రైవర్ల నుంచి కానీ, ప్రయాణికుల నుంచి కానీ కమీషన్‌ను వసూలు చేయదు. ఉబర్ క్రెడిట్స్, ఉబర్‌కు సంబంధించిర ఇతర ప్రమోషనల్ ఆఫర్లు ఈ రైడ్లకు వర్తించవు. ఉబెర్‌లో ఆటోలు బుక్ చేసుకొని, వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నా ఎలాంటి ఛార్జీలను విధించరు. ఆటోను బుక్ చేసుకునే టైంలో ఉబెర్ ఒక ధరను చూపిస్తుంది. అయితే ఆ ధర విషయంలో ఆటో డ్రైవరుతో ప్రయాణికులు బేరమాడుకోవచ్చు. ఆ ఛార్జీలో హెచ్చుతగ్గులు చేసే స్వేచ్ఛ ఆటో డ్రైవర్లకు ఉంటుంది.