HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mumbai Police Receive Threat To Blow Up Deputy Cm Eknath Shindes Car

Threat To Shinde: కారును బాంబుతో పేల్చేస్తాం.. డిప్యూటీ సీఎంకు హత్య బెదిరింపు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే‌కు(Threat To Shinde) హత్య బెదిరింపులు  వచ్చాయి.

  • By Pasha Published Date - 05:55 PM, Thu - 20 February 25
  • daily-hunt
Threat To Eknath Shinde Maharashtra Deputy Cm Mumbai Police

Threat To Shinde: మహారాష్ట్రలో రాజకీయంగా ఏదో జరుగుతోంది. అధికార మహాయుతి కూటమిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు ఇటీవలే సెక్యూరిటీ కవర్‌ను తగ్గించారు. దీనిపై ఆ పార్టీకి చెందిన పలువురు  ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఉద్దేశపూర్వకంగానే షిండే వర్గం శివసేనను చిన్నబుచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.  మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే‌కు(Threat To Shinde) హత్య బెదిరింపులు  వచ్చాయి. ఆయన ఉపయోగించే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు.

Also Read :BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?

బెదిరింపు మెయిల్‌ బూటకం

గురువారం మధ్యాహ్నం ముంబైలోని గోరెగావ్‌ పోలీసులకు ఈ మెయిల్‌ ద్వారా ఈ బెదిరింపు సందేశాన్ని దుండగులు పంపారు. మహారాష్ట్ర సచివాలయం, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్సే అందాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. షిండేకు వచ్చిన బెదిరింపు మెయిల్‌ బూటకమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మెయిల్‌ పంపిన వారిని గుర్తించి, పట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read :Google Pay: గూగుల్‌ పేలో బిల్ పేమెంట్స్‌ చేస్తున్నారా? బ్యాడ్ న్యూస్

ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ.. 

2022 సంవత్సరంలో ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే విడిపోయారు. దీంతో ఆనాటి  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ టైంలో షిండే వర్గంలోకి జంప్ అయిన థాక్రే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు భారీ భద్రతను కల్పించారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఏక్‌నాథ్ షిండే‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించి, ఫిరాయింపులను ప్రోత్సహించింది. దీంతో మహారాష్ట్రలో అకస్మాత్తుగా మహాయుతి సర్కారు ఏర్పడింది.  ఈసారి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో సీఎం సీటును ఏక్‌నాథ్ షిండేకు ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది. కమలదళం అగ్రనేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు మహారాష్ట్ర సీఎం సీటును అప్పగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ పరిణామంతో షాక్ అయిన షిండే కొన్ని రోజుల పాటు అలకబూనారు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా రంగంలోకి దిగడంతో, డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకునేందుకు ఏక్‌నాథ్ షిండే సిద్ధపడ్డారు. అయినా లోలోపల ఆయనను పరాభవ భావం వెంటాడుతోంది. భవిష్యత్తులో రాజకీయ సందర్భాన్ని బట్టి అది బయటపడే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eknath Shinde
  • Maharashtra
  • Maharashtra Deputy CM
  • mumbai
  • mumbai police
  • Threat To Shinde

Related News

Mumbai 26 11

Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

Mumbai 26/11 Terror Attack : భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ముంబై 26/11 ఉగ్రదాడులకు నేటితో సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి

    Latest News

    • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

    • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

    • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

    • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

    Trending News

      • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

      • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

      • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd