RBI: రూ. 100, 200 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన!
ఆర్‌బీఐ సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో దేశంలోని అన్ని బ్యాంకులను ఏటీఎంల నుండి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, తద్వారా మార్కెట్‌లో వీటి లభ్యత నిర్వహించబడాలని కోరింది.
- Author : Gopichand
Date : 29-04-2025 - 9:21 IST
Published By : Hashtagu Telugu Desk
RBI: ఇటీవల రూ. 2 వేల నోట్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ తాజాగా రూ. 100, 200 నోట్లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 100 రూపాయలు, 200 రూపాయల నోట్లకు సంబంధించి అన్ని బ్యాంకులకు ఒక పెద్ద ఆదేశాన్ని జారీ చేసింది. ఈ ఆదేశం వల్ల బ్యాంకులలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఈ రెండు నోట్లకు సంబంధించి జారీ చేసిన తన సర్క్యులర్‌లో తమ ఆదేశాన్ని వీలైనంత త్వరగా పాటించాలని, అమలు చేయాలని పేర్కొంది. ఇప్పుడు ఆర్‌బీఐ తన ఆదేశంలో ఏమి చెప్పిందో వివరంగా తెలుసుకుందాం.
ఆర్‌బీఐ సోమవారం జారీ చేసిన సర్క్యులర్‌లో దేశంలోని అన్ని బ్యాంకులను ఏటీఎంల నుండి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, తద్వారా మార్కెట్‌లో వీటి లభ్యత నిర్వహించబడాలని కోరింది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల (డబ్ల్యూఎల్‌ఏఓలు) ఈ ఆదేశాన్ని దశలవారీగా అమలు చేయాలని ఆర్‌బీఐ కోరింది.
Also Read: Tourist Destinations: ఉగ్రదాడి.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బ్యాంకింగ్ కాని సంస్థలచే నిర్వహించబడే ఏటీఎంలను వైట్ లేబుల్ ఏటీఎంలు అంటారు. ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో మరింత స్పష్టం చేస్తూ 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుండి 100 రూపాయలు లేదా 200 రూపాయల నోట్లు అందించబడాలని, దీనిని బ్యాంకులు నిర్ధారించాలని తెలిపింది. ఆ తర్వాత 2026 మార్చి 31 నాటికి దేశంలోని 90 శాతం ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుండి 100 రూపాయలు లేదా 200 రూపాయల నోట్లు అందించబడాలని పేర్కొంది.
కేంద్ర బ్యాంక్ ప్రకటనలో.. ఈ నోట్ల లభ్యతను ప్రజలకు పెంచడానికి ఈ చర్య అవసరమని పేర్కొంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏఓలు) ఈ ఆదేశాన్ని దశలవారీగా అమలు చేయాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక సర్క్యులర్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఇందులో.. తరచూ ఉపయోగించే నోట్ల విలువలకు ప్రజల యాక్సెస్‌ను పెంచడంలో భాగంగా అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్‌ఏఓలు) తమ ఏటీఎంల నుండి 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు క్రమం తప్పకుండా అందించేలా చూడాలి అని పేర్కొంది.