HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Sbi Hdfc Among Worlds Top 100 Banks

Rbi Governor Sanjay Malhotra : వరల్డ్ టాప్-100 బ్యాంకుల్లో SBI, HDFC లకు చోటు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rbi Governor
Rbi Governor

అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో భారత్ నుంచి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ లిస్టులోకి చేరతాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రూపాయి బలపడేందుకు తీసుకుంటున్న చర్యలు, మూలు ఖాతాల గుర్తింపు వంటి అంశాలపై మాట్లాడారు.

వరల్డ్ టాప్-100 బ్యాంకుల్లో భారత్ నుంచి అతి త్వరలోనే మరిన్ని బ్యాంకులు చేరతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక విస్తరణ వేగవంతం, బ్యాంకింగ్ వ్యవస్థలో వృద్ధి అందుకు దోహదపడతాయన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో వీకేఆర్‌వీ రావు స్మారకోపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడారు. అంతర్జాతీయ జాబితాలో చేరగలిగే, దేశీయ పెద్ద బ్యాంకుల సంఖ్యను రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించలేదని తెలిపారు.

‘ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్యాంకుల వృద్ధి వేగాన్ని గమనించినట్లయితే అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో అతి త్వరలోనే పలు బ్యాంకులు చేరేందుకు అవకాశం ఉంది.’ అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ టాప్-100 బ్యాంకుల్లో భారత్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43వ స్థానంలో కొనసాగుతోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 73వ స్థానంలో ఉంది. 2024-25లో దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకులు రికార్డ్ స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాలు అందుకున్నాయి. 2023-24 లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం మేర పెరగింది. ఈ లెక్కన చూసుకుంటే చాలా బ్యాంకులు ప్రపంచ స్థాయి టాప్ 100 లోకి వెళ్లేందుకు తక్కువ సమయమే పడుతుంది.

మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయిని ఏ స్థాయిలో ఉంచాలనే లక్ష్యాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించలేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. అమెరికా సుంకాల కారణంగా తలెత్తిన అనిశ్చితులతోనే రూపాయి విలువ క్షీణించినట్లు చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. దీంతో దేశ కరెంట్ ఖాతాపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. కరెంట్ ఖాతాతో పాటుగా క్యాపిటల్ ఖాతాపై ఎగుమతులు, ఎఫ్ఐఐల ప్రభావం పడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద సరిపడా విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని తెలిపారు. దీంతో అంతర్జాతీయ పరిణామాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అలాగే డిజిటల్ మోసాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన మ్యూల్ హంటర్ టూల్‌ అద్భుతమైన ఫలితాలను అందిస్తోన్న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ప్రతి నెలా ఈ ఏఐ టూల్ ద్వారా 20 వేలకు పైగా మ్యూల్ ఖాతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఈ మ్యూల్ హంటర్ ఏఐ టూల్‌ని 20 బ్యాంకుల్లో వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని దాదాపు దగ్గరగా ఉన్నామని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hdfc bank
  • Indian Banks
  • rbi
  • RBI Governor
  • RBI Governor Sanjay Malhotra
  • Sanjay Malhotra
  • sbi

Related News

Indian Stock Market

Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.

Iran War  పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 7

  • Rupee

    Rupee vs Dollar: డాలర్ ముందు కుప్పకూలిన భారత కరెన్సీ..

  • Rbi Loans

    War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Latest News

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd