SBI కార్డ్ కొత్త ఛార్జీలు.. తెలుసుకోకపోతే మీ బ్యాంకు ఖాతా ఖాళీ !!
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్ తాజాగా ఫీ స్ట్రక్చర్, ఇతర ఛార్జీలలో సవరణలు ప్రకటించింది. ఈ సవరణలు 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు యూజర్లు ముఖ్యంగా ఎడ్యుకేషన్ పేమెంట్లు,
- By Sudheer Published Date - 09:07 PM, Tue - 30 September 25

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్ తాజాగా ఫీ స్ట్రక్చర్, ఇతర ఛార్జీలలో సవరణలు ప్రకటించింది. ఈ సవరణలు 2025 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు యూజర్లు ముఖ్యంగా ఎడ్యుకేషన్ పేమెంట్లు, వాలెట్ లోడింగ్ వంటి కొన్ని ఎంపిక చేసిన లావాదేవీలకు అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ (క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి యాప్‌లు) ద్వారా చేసే ఎడ్యుకేషన్ సంబంధిత పేమెంట్లపై 1% ట్రాన్సాక్షన్ ఫీ విధించనున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నేరుగా POS యంత్రాల ద్వారా చెల్లిస్తే ఎలాంటి ఫీ ఉండదు. ఈ మార్పులు ఎస్‌బీఐ కార్డు యూజర్లకు అదనపు భారంగా మారే అవకాశముంది.
Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
థర్డ్ పార్టీ మెర్చంట్లకు చెందిన ఎడ్యుకేషన్ పేమెంట్లకు మెర్చంట్ కేటగిరీ కోడ్స్ (MCC) 8211, 8220, 8241, 8244, 8249, 8299 పరిధిలో ఉన్న ట్రాన్సాక్షన్లపై కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఎస్‌బీఐ కార్డ్ వెల్లడించింది. అదేవిధంగా వాలెట్ లోడింగ్ విషయంలో కూడా యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.1,000 దాటి వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్లపై 1% ఛార్జీలు విధించనున్నారు. అంటే వాలెట్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులు ఈ కొత్త ఛార్జీలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే అవాంఛిత అదనపు ఫీజులు చెల్లించే పరిస్థితి వస్తుంది.
క్యాష్ పేమెంట్లు, చెక్ పేమెంట్లు, కార్డ్ రీప్లేస్మెంట్, లేట్ పేమెంట్ వంటి అనేక సేవలపై ప్రస్తుతం ఉన్న ఫీ, ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదని ఎస్‌బీఐ కార్డ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం క్యాష్ పేమెంట్ ఫీ రూ.250గా ఉంది. పేమెంట్ ఆలస్యమైతే 2% లేట్ ఫీజు, కనీసం రూ.500 వరకూ ఉంటుంది. క్యాష్ అడ్వాన్స్ ఫీజు ఎస్‌బీఐ ఏటీఎంలలో, ఇతర దేశీయ ఏటీఎంలలో 2.5% (కనీసం రూ.500)గా, అంతర్జాతీయ ఏటీఎంలలో కూడా 2.5%గా ఉంటుంది. కార్డ్ రీప్లేస్మెంట్ ఫీజు రూ.100 నుంచి రూ.250 వరకు ఉండగా, ఆరమ్ కార్డ్ విషయంలో ఇది రూ.1500 వరకు ఉంటుంది. విదేశాల్లో ఎమర్జెన్సీ కార్డ్ రీప్లేస్మెంట్ వీసా కార్డులకు 175 డాలర్లు, మాస్టర్ కార్డులకు 148 డాలర్లుగా ఉంది. లేట్ పేమెంట్ ఛార్జీలు కూడా రూ.500 నుంచి రూ.1,100 వరకు స్థాయిని బట్టి ఉంటాయి. ఈ ఫీ వివరాలను వినియోగదారులు కచ్చితంగా తెలుసుకోవడం ద్వారా అదనపు ఆర్థిక భారాన్ని తప్పించుకోవచ్చు.