HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Satya Nadellas Pay Package Rises To A Record 96 5 Million

Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతంలో భారీ పెరుగుదల!

2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ద్వారా మైక్రోసాఫ్ట్, S&P 500 ఇండెక్స్‌ను రాబడి (రిటర్న్) పరంగా అధిగమించింది.

  • Author : Gopichand Date : 22-10-2025 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Satya Nadella
Satya Nadella

Satya Nadella: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వార్షిక వేతనం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లో ఆయన జీతంలో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ షేర్ల అద్భుత పనితీరు కారణంగానే నాదెళ్లకు ఈ బంపర్ ఆఫర్ దక్కింది. కంపెనీ దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో నాదెళ్ల మొత్తం పరిహారం (Total Compensation) 96.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8415 కోట్లు)కి పెరిగింది. ఇది గత ఏడాది కంటే గణనీయంగా ఎక్కువ. అంతకుముందు 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం వేతనం రూ. 4220 కోట్ల నుంచి రూ. 6880 కోట్లకు పెరిగింది.

రూ. 7310 కోట్లు షేర్ల రూపంలో

నాదెళ్ల ఈ ఏడాది వేతన ప్యాకేజీలో అత్యధిక భాగం అంటే దాదాపు రూ. 7310 కోట్లు (84 మిలియన్ డాలర్లు), కంపెనీ షేర్ల రూపంలో లభించింది. కేవలం రూ. 826 కోట్లు (9.5 మిలియన్ డాలర్లు) మాత్రమే నగదు బోనస్‌గా ఆయనకు అందాయి. ఇది ఆయన జీతంలో 90 శాతం వరకు షేర్ల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ భారీ వేతన పెరుగుదల పూర్తిగా మైక్రోసాఫ్ట్ షేర్ల అద్భుత పనితీరుతో ముడిపడి ఉంది. కంపెనీ షేర్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తుండటంతో నాదెళ్ల ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుతున్నారు.

Also Read: Modi Thanks to Trump : ట్రంప్ కు మోడీ థాంక్స్..ఎందుకంటే !!

ఇతర ఉన్నతాధికారుల జీతాలు సైతం

నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ముఖ్య అధికారుల వేతనాలు కూడా పెరిగాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ (Amy Hood)కు రూ. 2566 కోట్లు (29.5 మిలియన్ డాలర్లు) లభించగా, కొత్త కమర్షియల్ హెడ్ జడ్సన్ ఆల్‌థాఫ్ (Judson Althoff)కు రూ. 2453 కోట్లు (28.2 మిలియన్ డాలర్లు) ప్యాకేజీ లభించింది.

2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ద్వారా మైక్రోసాఫ్ట్, S&P 500 ఇండెక్స్‌ను రాబడి (రిటర్న్) పరంగా అధిగమించింది. ఎందుకంటే ఆ ఇండెక్స్ కేవలం 15 శాతం రాబడిని మాత్రమే అందించింది. గత మూడు సంవత్సరాలలో కంపెనీ షేర్ల విలువ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఈ అద్భుతమైన వృద్ధి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ ఆక్రమణత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహం సత్ఫలితాలను ఇస్తోందని నిరూపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amy Hood
  • business
  • business news
  • Judson Althoff
  • Satya Nadella
  • Total Compensation

Related News

DGCA takes strict action against IndiGo: Rs 22.20 crore fine

ఇండిగోపై డీజీసీఏ కఠిన చర్యలు: రూ.22.20 కోట్ల జరిమానా

గత ఏడాది డిసెంబర్ నెలలో ఇండిగో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేయడం, షెడ్యూల్‌కు మించి ఆలస్యాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

  • CIBIL

    ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

  • Gold

    బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

  • Budget 2026

    బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

  • Bank Holiday

    రేపు బ్యాంకులు ఎక్కడెక్కడ పని చేయవు?

Latest News

  • అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్

  • USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్

  • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

  • దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం

Trending News

    • ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

    • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

    • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

    • వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd