RBI : ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా
శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
- By Latha Suma Published Date - 01:13 PM, Wed - 11 December 24

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అతని నియామకం మూడు సంవత్సరాలు. ఈరోజు నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ బుధవారం ట్వీట్‌లో ప్రకటించింది. ఇక ఇప్పటి వరకూ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిన్న శక్తికాంత దాస్ పదవీ విమరణ చేయడంతో.. ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నేడు బాధ్యతలు స్వీకరించారు.
రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన 1990-బ్యాచ్ అధికారి మల్హోత్రా. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, USA నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. మింట్ స్ట్రీట్‌లో దేశం యొక్క ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ మరియు బ్యాంకింగ్ నియంత్రణకు బాధ్యత వహించండి. మల్హోత్రా ఫిబ్రవరి 5 నుండి 7, 2025 వరకు తన మొదటి ద్రవ్య విధాన సమీక్షను నిర్వహిస్తారు.
కాగా, సంజయ్ మల్హోత్రా తన కెరియర్‌లో ఎన్నో ప్రభుత్వ రంగ శాఖల్లో మరెన్నో బాధ్యతల్ని నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. విద్యుత్తు, ఆర్థిక, పన్నులు, ఐటీ, గనులు తదితర రంగాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తుండగా, అంతకుముందు ఆర్థిక సేవల కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. శక్తికాంత దాస్ లాగానే మల్హోత్రా కూడా 1990లో ఉద్యోగంలో చేరిన కెరీర్ బ్యూరోక్రాట్ మరియు రాజస్థాన్ కేడర్‌కు చెందినవాడు.