రిపబ్లిక్ డే సేల్ 2026: సెన్‌హైజర్ ప్రీమియం ఆడియో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు
ఈ సేల్‌లో భాగంగా వినియోగదారులు 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు అలాగే కొన్ని ఉత్పత్తులపై 50 శాతం వరకు ధర తగ్గింపు పొందే అవకాశం ఉంది.
- Author : Latha Suma
Date : 23-01-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
. క్రియేటర్ల కోసం సెన్‌హైజర్ ప్రొఫైల్ వైర్‌లెస్.. స్టూడియో మైక్రోఫోన్లు
. ప్రీమియం హెడ్‌ఫోన్లు: మొమెంటమ్ 4 ..హెచ్‌డి 630 అనుభూతి
. స్టూడియో క్వాలిటీ నుంచి ట్రూ వైర్‌లెస్ వరకు: TLM 102 & మొమెంటమ్ ట్రూ వైర్‌లెస్ 4
Sennheiser : ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో విశ్వసనీయమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సెన్‌హైజర్ భారతదేశంలో రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా తన ప్రీమియం ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్ జనవరి 16 నుంచి ప్రైమ్, నాన్-ప్రైమ్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 15 అర్ధరాత్రి నుంచే ముందస్తు యాక్సెస్ కల్పించారు. ఈ సేల్‌లో భాగంగా వినియోగదారులు 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు అలాగే కొన్ని ఉత్పత్తులపై 50 శాతం వరకు ధర తగ్గింపు పొందే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ మైక్రోఫోన్ల నుంచి ప్రీమియం హెడ్‌ఫోన్లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ ఆఫర్లలో ఉన్నాయి.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, వీడియోగ్రాఫర్లు, ఇంటర్వ్యూ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన సెన్‌హైజర్ ప్రొఫైల్ వైర్‌లెస్ 2-ఛానల్ సెట్ ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కాంపాక్ట్, ఆల్-ఇన్-వన్ వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్‌గా 2.4 GHz డ్యూయల్-ఛానల్ రిసీవర్, రెండు క్లిప్-ఆన్ మైక్రోఫోన్లు, అలాగే హ్యాండ్‌హెల్డ్ ఇంటర్వ్యూ మైక్‌గా ఉపయోగించుకునే అల్ట్రా-పోర్టబుల్ ఛార్జింగ్ బార్‌ను కలిగి ఉంటుంది. తక్కువ సెటప్‌తోనే ప్రొఫెషనల్ స్థాయి ఆడియో అందించడం దీని ప్రత్యేకత. ఇదే కోవలో స్టూడియో మరియు లైవ్ వాతావరణాల కోసం రూపొందించిన సెన్‌హైజర్ ఎమ్‌డి 421 కాంపాక్ట్ మైక్రోఫోన్ కూడా ప్రత్యేక ఆఫర్లతో లభిస్తోంది. ఇది లెజెండరీ MD 421 సౌండ్‌ను చిన్న మరింత బహుముఖ డిజైన్‌లో అందిస్తుంది. కార్డియోయిడ్ పికప్ ప్యాటర్న్, వైడ్ డైనమిక్ రేంజ్, అధిక సౌండ్ ప్రెజర్ లెవెల్స్‌ను తట్టుకునే సామర్థ్యం దీనిని వోకల్స్, వాయిద్యాల రికార్డింగ్‌కు అద్భుత ఎంపికగా మారుస్తాయి.
సెన్‌హైజర్ ఫ్లాగ్‌షిప్ హెడ్‌ఫోన్లలో ఒకటైన మొమెంటమ్ 4 వైర్‌లెస్ ఈ సేల్‌లో ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. ఖచ్చితమైన 42 mm ట్రాన్స్‌డ్యూసర్లతో పనిచేసే ఇవి బ్రాండ్ సిగ్నేచర్ సౌండ్‌ను అద్భుతమైన వివరాలతో వినిపిస్తాయి. అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు రోజంతా సౌకర్యవంతమైన వినికిడి అనుభవాన్ని అందిస్తాయి. అదేవిధంగా హెచ్‌డి 630 విబి హెడ్‌ఫోన్లు కూడా ఈ సేల్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లతో లభిస్తున్నాయి. సెన్‌హైజర్ తొలిసారి పరిచయం చేసిన పారామెట్రిక్ ఈక్వలైజర్, క్రాస్‌ఫీడ్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వింటున్నట్లే సహజమైన శ్రవణ అనుభూతిని అందిస్తాయి. USB-C, బ్లూటూత్ ద్వారా 24-bit/96 kHz హై-రెజల్యూషన్ ఆడియోకు మద్దతు ఇవ్వడం వీటి ప్రత్యేకత.
హోమ్ ప్రాజెక్ట్ స్టూడియో వినియోగదారుల కోసం న్యూమాన్ టిఎల్‌ఎమ్ 102 ఒక విశ్వసనీయ ఎంపిక. జర్మనీలో రూపొందించిన ఈ కాంపాక్ట్ లార్జ్-డయాఫ్రామ్ కండెన్సర్ మైక్రోఫోన్ సమతుల్యమైన సౌండ్, సిల్కీ హై ఫ్రీక్వెన్సీలు, శక్తివంతమైన లో-ఎండ్ రెస్పాన్స్‌కు ప్రసిద్ధి చెందింది. తక్కువ సెల్ఫ్-నాయిస్ అధిక SPL హ్యాండ్లింగ్‌తో ప్రొఫెషనల్ రికార్డింగ్ అవసరాలకు ఇది సరిపోతుంది. మరోవైపు మొమెంటమ్ ట్రూ వైర్‌లెస్ 4 ఇయర్‌బడ్స్ లాస్‌లెస్ ఆడియో, ఫ్యూచర్-రెడీ టెక్నాలజీలతో ఆకట్టుకుంటున్నాయి. ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్ సిస్టమ్ ద్వారా 24-bit/96 kHz హై-ఫిడెలిటీ ఆడియో, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 30 గంటల వరకు ప్లేబ్యాక్ క్వి వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు వీటిని ప్రీమియం విభాగంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా సెన్‌హైజర్ అందిస్తున్న ఈ ఆఫర్లు ఆడియో ప్రేమికులు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్‌కు ఒక అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు.