Ratan Tata Last Rites : రతన్ టాటా అంత్యక్రియలు జరిగేది ఎక్కడంటే..
Ratan Tata last rites : రతన్ టాటా కంటే ముందు టాటా గ్రూప్ చైర్మన్‌లుగా (టాటా కుటుంబాని చెందిన) పనిచేసిన వారి అంత్యక్రియలు విదేశాల్లోనే జరిగాయి
- By Sudheer Published Date - 11:28 AM, Thu - 10 October 24
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Naval Tata ) (86) తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించిన ఆయన.. ప్రపంచం గర్వించే స్థాయికి ఎదగడమే కాదు…కోట్లాది మందికి జీవితాన్ని అందజేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరనే విషయం తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రతన్ పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసంలో ఉంచారు. ఈయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది.
రతన్ టాటా భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించేందుకు వీలుగా గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణ ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీపీఏ)లో ఉంచనున్నారు. అనంతరం రతన్ టాటా భౌతికకాయాన్ని అంత్యక్రియల (Ratan Tata Last Rites) నిమిత్తం వర్లీ శ్మశానవాటిక (Worli Crematorium)కు తీసుకెళ్లనున్నారు. అక్కడ రతన్ టాటా అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గతంలో రతన్ టాటా కంటే ముందు టాటా గ్రూప్ చైర్మన్‌లుగా (టాటా కుటుంబాని చెందిన) పనిచేసిన వారి అంత్యక్రియలు విదేశాల్లోనే జరిగాయి. టాటా గ్రూప్ తొలి చైర్మన్ జంషెడ్జీ టాటా, జెంషెడ్‌జీ టాటా తర్వాత టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన దొరాబ్జీ టాటా అంత్యక్రియలు వోకింగ్‌లోని బ్రూక్‌వుడ్ స్మశానవాటికలోని పార్సీ శ్మశాన వాటికలో నిర్వహించారు. దొరాబ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ చైర్మన్‌గా సర్ నౌరోజీ సక్లత్వాలా టాటా సన్స్ చైర్మన్‌గా జేఆర్‌డీ టాటా బాధ్యతలు చేపట్టారు. జేఆర్‌డీ టాటా అంత్యక్రియలు ప్యారిస్‌లోని పెరె లాచైస్ స్మశానవాటికలో జరిగాయి. జేఆర్‌డీ టాటా తర్వాత టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో జరగనున్నాయి.
Read Also : Chana Dal Beneftis: పచ్చి శనగపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు.. వినియోగాలు..!