Paytm UPI : గుడ్ న్యూస్.. మరో 6 దేశాల్లోనూ పేటీఎం యూపీఐ సేవలు
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు భారతీయులకు ఈ ఫీచర్(Paytm UPI) బాగా ఉపయోగపడుతుందని పేటీఎం ఆశాభావం వ్యక్తం చేసింది.
- By Pasha Published Date - 07:01 PM, Tue - 19 November 24

Paytm UPI : మీరు పేటీఎం వాడుతున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే!! ఇకపై విదేశాల్లో కూడా మీరు పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్ దేశాల్లో ఇకపై పేటీఎం యూజర్లు యూపీఐ లావాదేవీలు చేసుకోవచ్చు. ఆయా దేశాల్లో షాపింగ్, డైనింగ్‌లు చేసినప్పుడు దర్జాగా పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఈవిషయాన్ని మంగళవారం పేటీఎం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read :GO 16 : జీవో 16ను కొట్టేసిన హైకోర్టు.. జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వేలాది మందికి టెన్షన్
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు భారతీయులకు ఈ ఫీచర్(Paytm UPI) బాగా ఉపయోగపడుతుందని పేటీఎం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు సైతం ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చని పేర్కొంది. సంవత్సరం చివర్లో చాలామంది భారతీయులు ఫారిన్ టూర్లకు వెళ్తుంటారు. అలాంటివారు తమ యూపీఐ ఫీచర్‌ను వాడుకొని ఆయా లొకేషన్లలో షాపింగ్, డైనింగ్‌లను మరింత ఆనందభరితం చేసుకోవచ్చని పేటీఎం పేర్కొంది.
Also Read :Google Chrome Sale : అమెరికా న్యాయశాఖ వర్సెస్ గూగుల్.. క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేస్తారా ?
యూపీఐ పేమెంట్లు ఇలా చేశారో.. ఐటీ నోటీసులు
ఇష్టం వచ్చినట్లుగా యూపీఐ లావాదేవీలు చేస్తే మీరు చిక్కుల్లో పడే ముప్పు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో చేసే యూపీఐ లావాదేవీలపై ఆదాయపు పన్ను విభాగం నిఘా ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో జమ అయ్యే డబ్బుపైనా ఐటీ విభాగం ఫోకస్ ఉంటుంది. వాటిపై డౌట్స్ వస్తే మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ నుంచి పన్నులు, పెనాల్టీలను ఐటీ విభాగం కోరొచ్చు. రోజువారీగా జరిగే యూపీఐ లావాదేవీలలో సందేహాస్పదంగా ఉండేవాటిని ఏఐ టెక్నాలజీ ద్వారా ఐటీ శాఖ గుర్తిస్తుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పొదుపు ఖాతాల్లో రూ.10 లక్షల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ దాటి సేవింగ్స్ ఖాతాలో డబ్బులు జమ అయితే.. ఆ వివరాలు ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి వెళ్తాయి. ఈ లిమిట్ చూసుకోకుండా యూపీఐ పేమెంట్లు చేస్తే నోటీసులు వస్తాయి. రూ.50 వేలు అంతకు మించి ట్రాన్సాక్షన్ చేసినప్పు పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాలను గుర్తుంచుకొని యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయడం బెటర్.